కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో రంగంలోకి దిగిన కేసీఆర్.. మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన.. తెలంగాణలో కరెంట్ కోతలు, నీటి సమస్యపై గొంతు విప్పారు.. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ నీటి, విద్యుత్ కొరత కారణంగా మూసివేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు నోటీసు జారీ చేయడంపై స్పందించారు. ఈ విషయంలో గత 4 నెలలుగా సీఎం, డీసీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి సమస్య లేదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదన అబద్ధమని పేర్కొన్నారు.. ఈ విషయాన్ని ఉస్మానియా యూనివర్శిటీ చీఫ్ వార్డెన్ నోటీసులే నిర్ధారిస్తున్నాయని కేసీఆర్ (KCR) తెలిపారు.
మరోవైపు యూనివర్సిటీ వార్డెన్ జారీ చేసిన నోటీసుతో పాటు ఆందోళన చేస్తున్న విద్యార్థుల వీడియోను తన సోషల్ మీడియాలో కేసీఆర్ పోస్ట్ చేశారు.. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూసిన బీఆర్ఎస్ (BRS).. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయిన విజయం అందుకోవాలనే ఆరాటంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా పాలన వైఫ్యల్యాలను, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ.. ప్రభుత్వం విఫలం అయ్యిందనే ఆరోపణలు చేస్తున్నారు.. పోయిన పరువు మళ్ళీ దక్కించుకోవాలనే భావనతో ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు.. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. అబద్ధాలు చెప్పి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకుంది చాలని ఎద్దేవా చేశారు..