Telugu News » BRS : పదేళ్లు పాలించిన కేసీఆర్ ఈ తప్పులు చేయకుంటే మరోసారి గెలిచేవారా..!?

BRS : పదేళ్లు పాలించిన కేసీఆర్ ఈ తప్పులు చేయకుంటే మరోసారి గెలిచేవారా..!?

తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించామని చెప్పుకునే కేసీఆర్‌ తన పార్టీ పేరులో తెలంగాణ తీసివేయడం పెద్ద మైనస్ అని అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ (TRS) పేరు ఆ పార్టీకి సెంటిమెంట్‌గా మారిందని అంటున్నారు.

by Venu
kcr fire on congress at shadnagar meeting

– బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి?
– తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారు?
– ప్రజల చేత ఎందుకు తిరస్కరించబడ్డారు?
– ఆయన చేసిన తప్పులేంటి?

తెలంగాణ పలితాలు.. పదవులు పర్మినెంట్ కాదని, అహంకారం, ధన, అధికార దాహం.. ఎప్పటికైనా చేటు చేస్తాయని నిరూపించాయని అంటున్నారు కొందరు. దొరల పాలనతో జనంపై పెత్తనం చలాయించాలని చూస్తే ఓటర్లు చేసే నిశబ్ధ యుద్ధంలో ఎంతటి పేరున్న పార్టీలైనా గల్లంతు అవ్వడం ఖాయం అనే నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయని అంటున్నారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ఆయన ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలచి ఫాంహౌస్ కి పరిమితం చేశారని అనుకుంటున్నారు. ఈ అపజయం వెనక లోతైన కారణాలు ఎన్నో ఉన్నాయన్నది వారి వాదన.

kcr-shocking-comments-on-congress

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధించగా.. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. రాష్ట్రాన్ని తానే కొట్లాడి సాధించామని చెప్పుకునే కేసీఆర్‌.. తన పార్టీ పేరులో తెలంగాణ తీసివేయడం పెద్ద మైనస్ అయిందని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ పేరు ఆ పార్టీకి సెంటిమెంట్‌ గా మారిందని.. అదీగాక ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడం పెద్ద మైనస్ అయిందని చెబుతున్నారు.

ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందనే ఆరోపణలు గులాబీ పార్టీ పునాదులు కదిలించాయని క్షుణంగా తెలుస్తోంది. అవినీతి, అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం.. బీఆర్ఎస్ కు మైనస్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య.. రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వం సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకులు.. మరోవైపు కౌలు రైతులకు రైతు బంధు పథకం ఇవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి కీలక అంశాలను కేసీఆర్ సరిగ్గా డీల్ చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రెండు నెలల ముందు.. వికలాంగులకు పెన్షన్ పెంచడం, లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు వంటి అంశాలు చేపట్టినా సత్ఫలితాలు ఇవ్వలేదని.. తొమ్మిదేళ్లు పాలించిన కేసీఆర్ ఆయా పథకాలను గతంలోనే అమలు చేసి ఉంటే ప్రజల్లో మైలేజ్ పెరిగి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదీగాక బీఆర్ఎస్ నేతల్లో గర్వం, అహంకారం పెరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందని అంటున్నారు. మొత్తానికి స్వయంకృతాపరాధమే బీఆర్ఎస్ కొంప ముంచిందని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు.

You may also like

Leave a Comment