Telugu News » Kerala: సీపీఐపై రాహుల్‌గాంధీ పోటీ.. కేరళ సీఎం హాట్ కామెంట్స్..!

Kerala: సీపీఐపై రాహుల్‌గాంధీ పోటీ.. కేరళ సీఎం హాట్ కామెంట్స్..!

కేరళ సీఎం(Kerala CM) పినరయి విజయన్(Pinarayi Vijayan) కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేఠీలో ఓడిపోతానని తెలుసుకున్న రాహుల్.. కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారని ఆయన ఆరోపించారు.

by Mano
Kerala: Rahul Gandhi's contest against CPI.. Kerala CM's hot comments..!

కేరళ(Kerala)లోని వయనాడ్‌(Wayanad) నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahulgandhi) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థానం నుంచి అధికారంలో ఉన్నపొత్తులో భాగంగా సీపీఎం(CPI) వయనాడ్ పార్లమెంట్ సీటును సీపీఐ జాతీయ నాయకురాలు అన్నీ రాజాకు కేటాయించింది.

Kerala: Rahul Gandhi's contest against CPI.. Kerala CM's hot comments..!

అయితే సీపీఐతో రాహుల్ పోటీకి దిగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపషథ్యంలో కేరళ సీఎం(Kerala CM) పినరయి విజయన్(Pinarayi Vijayan) కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేఠీలో ఓడిపోతానని తెలుసుకున్న రాహుల్.. కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారని ఆయన ఆరోపించారు.

ఇక్కడ కమ్యునిస్టుల మద్దతుతో రాహుల్ గాంధీ ఎంపీగా విజయం సాధించారని పేర్కొన్నారు. మణిపూర్ సమస్య సమయంలో బీజేపీ ప్రభుత్వ అకృత్యాలను తీవ్రంగా ఎండగట్టినందుకు ఆమెను దేశ వ్యతిరేకి అనే ముద్ర వేశారన్నారు. దేశం ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు అన్నీ రాజా అక్కడ ప్రత్యక్షం కావడం మనం నిత్యం చూస్తూనే ఉంటామన్నారు.

కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎక్కడైనా చూశామా? అని సీఎం పినరయి విజయన్ అన్నారు. ఇదిలా ఉండగా, 2019లో రాహుల్ తొలిసారి వయనాడ్ నుంచి పోటీ చేయగా 4లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు. అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న అమేఠీ నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు.

You may also like

Leave a Comment