Telugu News » Kesineni Nani : చంద్రబాబు 2014లో గెలిచాక ఏవో అద్భుతాలు చేస్తాడని భావించాం.. కానీ ఆ కోరికతో ఉన్నాడు..!!

Kesineni Nani : చంద్రబాబు 2014లో గెలిచాక ఏవో అద్భుతాలు చేస్తాడని భావించాం.. కానీ ఆ కోరికతో ఉన్నాడు..!!

నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి దేశచరిత్రలో నిలిచి పోయారని గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఎన్టీఆర్.. ఎప్పుడు ప్రజాశ్రేయస్సు కోసమే ఆరాటపడేవారని తెలిపారు.

by Venu

టీడీపీ (TDP) నుంచి వైసీపీ YCP)లో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేశినేని భవన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడిన కేశినేని.. తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు అధికారంలోకి రారని జోస్యం చెప్పారు..

నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి దేశచరిత్రలో నిలిచి పోయారని గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఎన్టీఆర్.. ఎప్పుడు ప్రజాశ్రేయస్సు కోసమే ఆరాటపడేవారని తెలిపారు. ఈ దేశంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదన్నారు. ఆయన తర్వాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాత్రమేనని కేశినేని పేర్కొన్నారు.

వీరిద్దరి బాటలో నడుస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అని.. వీళ్ళకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసలు కురిపించారు.. మరోవైపు టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు.. చంద్రబాబు 2014లో గెలిచాక ఏవో అద్భుతాలు చేస్తాడని భావించాం.. కానీ, కేవలం తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న కోరిక బలంగా పెంచుకొన్నాడని కేశినేని నాని విమర్శించారు..

మరోవైపు ఏపీలో రానున్న మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని నాయకులు అంతే వేగంగా నిర్ణయాలు తీసుకొంటూ పక్క పార్టీలో పాగా వేస్తున్నారు. విజయవాడ (Vijayawada) పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేశినేని నాని (Kesineni Nani)కి ఈసారి టీడీపీ నుంచి టికెట్‌ ఇవ్వడం లేదనే సంకేతాలు అందడంతో వైసీపీలో చేరారు..

You may also like

Leave a Comment