Telugu News » khammam : కాంగ్రెస్‌ స్పీడ్ కు బ్రేక్ వేస్తున్న ఖమ్మం.. ప్రశ్నలా మిగిలిన ఎంపీ టికెట్..!

khammam : కాంగ్రెస్‌ స్పీడ్ కు బ్రేక్ వేస్తున్న ఖమ్మం.. ప్రశ్నలా మిగిలిన ఎంపీ టికెట్..!

లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఆరాటం ఉన్న హస్తానికి.. ప్రస్తుతం ఖమ్మం సీటు విషయం కొలిక్కి రాకుంటే చిక్కులు తప్పవని అనుకొంటున్నారు.

by Venu
lokhsabha-elections

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Election) ఖమ్మం (Khammam) సీటు కాంగ్రెస్​ (Congress) ఆశావహులకు హాట్ కేక్​లా మారింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు టికెట్ రేసులో ఉన్నారని తెలిసిందే.. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ స్థానంపై టెన్షన్ నెలకొంది.

మరోవైపు ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. తన భార్య నందినికి ఎలాగైనా టికెట్ దక్కించాలని ఆశిస్తున్నారు.. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు.. అలాగే తన కొడుకు యుగెందర్‌కు ఖమ్మం టికెట్ ఇప్పించేందుకు తుమ్మల నాగేశ్వరరావు సైతం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..

మొత్తానికి ఖమ్మం సీటు ఈ నేతలకు నిదుర పట్టకుండా చేస్తుందని అనుకొంటున్నారు.. ముగ్గురు నేతల మధ్య నెలకొన్న తీవ్ర పోటీలో చివరికి ఎవరిని పార్లమెంట్ టికెట్ వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు ఏఐసీసీకి కూడా ఇదొక పెద్ద పజిల్ లా మారిందని చర్చించుకొంటున్నారు. ఎవరిని తక్కువ చేసిన పార్టీకి నష్టం కలుగుతుందనే భావనలో ఉన్న అధిష్టానం.. మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఏఐసీసీ ఇంచార్జ్ మున్షీకి అప్పగించింది.

ఈమేరకు సాయంత్రం మున్షీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ముఖ్య నేతల సమావేశం జరగనుందని తెలుస్తోంది.. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారని సమాచారం.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామనే ఆనందం.. లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఆరాటం ఉన్న హస్తానికి.. ప్రస్తుతం ఖమ్మం సీటు విషయం కొలిక్కి రాకుంటే చిక్కులు తప్పవని అనుకొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనే ఆసక్తి రాజకీయ వర్గాలలో ప్రశ్నలా మిగిలిందంటున్నారు..

You may also like

Leave a Comment