Telugu News » Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయి…..!

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయి…..!

ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

by Ramu
kishan reddy fires on brs and congress

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి అనుకూలంగా ఉండనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు రెండు పార్టీల నేతలు కుమ్మక్కు అవుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

kishan reddy fires on brs and congress

మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ….. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామని వివరించారు. బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో శుక్రవారం సమావేశం కానుందన్నారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామని తెలిపారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్ ను ఓడిస్తామన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీఆర్‌ఎస్‌కు ఓటేసినా ఒక్కటేనన్నారు. బీఆర్‌ఎస్‌ అరకొర సీటు గెలిచిన, ఓడినా తెలంగాణకు పెద్దగా ఒరిగేది కానీ పోయేది గానీ ఏం లేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. , బీఆర్‌ఎస్‌ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు. ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ కోసం రాష్ట్ర కాంగ్రెస్ వసూళ్లు మొదలు పెట్టిందని ఆరోపించారు.

కేంద్ర కాంగ్రెస్‌కు సూట్ కేసులు మోస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెడితే.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కూటమీ బీటలు వారుతోందన్నారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచెలా తమ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందని అన్నారు.

మళ్లీ మోడీ పీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారన్నారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌‌లోని నేతలు బీజీపీలో చేరాలన్నారు. అందుకు తాను పిలుపు ఇస్తున్నానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌లు డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులు పై చర్యలు అన్నారని గుర్తు చేశారు. ఇంకా ఇప్పటికీ మీప మేషాలు లెక్క పెడుతున్నారని పేర్కొన్నారు. ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరంపై చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. డబ్బుల కోసం మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపింారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తోందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఆడుకోవద్దన్నారు. జల వివాదాల పై ప్రజలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ లు మభ్య పెడుతున్నారని ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు.

You may also like

Leave a Comment