Telugu News » Jagga Reddy : బీఆర్ఎస్ అలవాటునే మేం కొనసాగిస్తాం…. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు…!

Jagga Reddy : బీఆర్ఎస్ అలవాటునే మేం కొనసాగిస్తాం…. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు…!

ఈ విషయాన్ని తాను కాన్ఫిడెంట్ గా చెబుతున్నానని అన్నారు. ప్రజలకు బాగా సేవ చేయాలని, మంచి పేరు తెచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు అట్రాక్ట్ అవుతారని చెప్పారు.

by Ramu
jagga reddy sensational Comments

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు వస్తారంటూ బాంబు పేల్చారు. ఈ విషయాన్ని తాను కాన్ఫిడెంట్ గా చెబుతున్నానని అన్నారు. ప్రజలకు బాగా సేవ చేయాలని, మంచి పేరు తెచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు అట్రాక్ట్ అవుతారని చెప్పారు.

jagga reddy sensational Comments

గత తొమ్మిదేండ్లలో కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. పోలీసులను అడ్డుగా పెట్టుకుని గడ్డ పారతో పొడిచారని అన్నారు. ఇప్పుడు తాము కనీసం సూదీతోనైనా పొడవ కూడదా? అని ప్రశ్నించారు. కానీ తాము బీఆర్ఎస్ వాళ్లంతా మూర్ఖులం కాదన్నారు.

అయితే రాజకీయంగా కొన్ని పనులు తమకు తప్పవని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అలవాటునే తాము కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తన మామ కేసీఆర్‌కు హరీశ్‌రావు ఎప్పుడైనా వెన్నుపోటు పోడిచే అవకాశం ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందన్నారు. మెదక్ ఎంపీ టికెట్ విషయంపై ఆయన స్పందించారు. ఎంపీ టికెట్ కోసం తాను దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఒక వేళ రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు.

You may also like

Leave a Comment