తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ సృష్టించిన నియోజక వర్గం కామారెడ్డి (kamareddy)..ఇక్కడి నుంచి కేసీఆర్ (KCR).. రేవంత్ రెడ్డి (Revanth Reddy) బరిలోకి నిలవడం రాజకీయ వర్గాలలో పెను సంచలనానికి కారణం అయ్యింది. అయితే వీరిద్దరూ కాకుండా బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా గెలవడం చర్చకు దారితీసింది. అయితే ఈ గెలుపు పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి తమ పార్టీ చరిత్ర సృష్టించిందని కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. జాతీయ నాయకత్వం కామారెడ్డి ఫలితం పట్ల హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ హ్యాట్రిక్ సాధిస్తారని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయాన్నిపేర్కొన్నారు..
మరోవైపు అయిదేళ్ల పోరాట ఫలితమే వెంకట రమణారెడ్డికి విజయాన్ని అందించిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని, అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. వచ్చే ఐదేళ్లు క్రియాశీల, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని తెలిపిన కిషన్ రెడ్డి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే తమ ఓటు వేస్తామనే సంకేతాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చినట్టు సృష్టం చేశారు..