Telugu News » Kishan Reddy : తెలంగాణలో బీజేపీ ఓడిపోతుందని ఊహించిన కిషన్ రెడ్డి.. ఇది నిజమా.. !?

Kishan Reddy : తెలంగాణలో బీజేపీ ఓడిపోతుందని ఊహించిన కిషన్ రెడ్డి.. ఇది నిజమా.. !?

తెలంగాణ ప్రజల టీమ్ అయిన బీజేపీ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కిషన్‌రెడ్డి అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేయడంతో.. తెలంగాణలో బీజేపీ ఓటమిని ముందుగానే ఊహించిందా? అని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయంటున్నారు..

by Venu
kishanreddy

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) బీఆర్‌ఎస్‌ (BRS), కాంగెస్ (Congress)పార్టీల పై మండిపడ్డారు. హైదరాబాద్‌ (Hyderabad) నాంపల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి బీజేపీకి ప్రజా సంక్షేమమే ముఖ్యమని.. పదవులు కాదని తెలిపారు. దోపిడి చేసే వారంతా ఒక్క చోట చేరారని విమర్శించారు.

ఈ టీమ్ అంతా కలసి.. తెలంగాణ ప్రజల టీమ్ అయిన బీజేపీ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కిషన్‌రెడ్డి అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేయడంతో.. తెలంగాణలో బీజేపీ ఓటమిని ముందుగానే ఊహించిందా? అని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయంటున్నారు..

అధికారంలోకి రావాలని కొట్లాడే వాళ్ళు ప్రతిపక్షం అయినా ఓకే అని ఎలా అంటారని కార్యకర్తల్లో అనుమానపు బీజాలు మొలకెత్తాయని ప్రచారం జరుగుతోంది. మరికొందరు కిషన్ జీ నోట ప్రతిపక్షం మాట!.. ఎందుకు వచ్చిందని ఆరాతీసే పనిలో పడ్డారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ మాట ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ, బీఆర్‌ఎస్‌ కానీ అనలేదు.. అనే సాహసం కూడా చేయదని కొందరు పార్టీ వర్గాలలో రహస్యంగా మాట్లాడుకొంటున్నారు.

ఇక ఈ ముచ్చట్లను అలా పక్కన పెడితే.. రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అందరూ కలిసి పనిచేయాలని కిషన్‌రెడ్డి కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలన.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.

You may also like

Leave a Comment