Telugu News » Kishan Reddy : కామారెడ్డిలో కిషన్ రెడ్డి.. సర్వేల్లో కేసీఆర్ ఓడిపోతున్నాడంటూ కీలక వ్యాఖ్యలు..!!

Kishan Reddy : కామారెడ్డిలో కిషన్ రెడ్డి.. సర్వేల్లో కేసీఆర్ ఓడిపోతున్నాడంటూ కీలక వ్యాఖ్యలు..!!

కాళేశ్వరం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అదీగాక కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ళలో గజ్వేల్ ప్రజలను ప్రేమగా పలకరించింది లేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేసుకున్న సర్వేల్లో ఓడిపోతానని తెలిసి కామారెడ్డి వస్తున్నాడని ఎద్దేవా చేశారు..

by Venu
Kishan-Reddy

తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి (Kamareddy) జిల్లాలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) పర్యటించారు. బీజేపీ శ్రేణులు పొందుర్తి వద్ద భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఖర్చు లక్ష 20 వేల కోట్లకు పెంచిన కేసీఆర్.. ప్రజా ధనాన్ని నీళ్లపాలు చేశారని విమర్శించారు.

Minister Kishan Reddy

ప్రస్తుతం కాళేశ్వరం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అదీగాక కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ళలో గజ్వేల్ ప్రజలను ప్రేమగా పలకరించింది లేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేసుకున్న సర్వేల్లో ఓడిపోతానని తెలిసి కామారెడ్డి వస్తున్నాడని ఎద్దేవా చేశారు.. 5 లక్షల కోట్లు అప్పు చేసి, రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ ని ఓడించి చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని కిషన్ రెడ్డి అన్నారు..

ప్రస్తుతం తెలంగాణ భవిష్యత్తు కామారెడ్డి చేతిలో ఉందన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ పోవాలి.. రైతు ప్రభుత్వం రావాలని వెల్లడించారు. కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. ఇక్కడి ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళు కాదని.. మార్పు కామారెడ్డి నుంచే మొదలు పెడతారని కిషన్ రెడ్డి అన్నారు.. మరోవైపు కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ గజ్వేల్ వెళ్లడంతో.. వణుకుపుట్టిన సీఎం ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. ఇక తెలంగాణ బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.. అందుకు బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment