Telugu News » Kishan Reddy: విమోచన దినం బీజేపీ కార్యక్రమం కాదు: కిషన్ రెడ్డి

Kishan Reddy: విమోచన దినం బీజేపీ కార్యక్రమం కాదు: కిషన్ రెడ్డి

 అప్పటీ హైదరాబాద్ సంస్థానం ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉందనీ, మహారాష్ట్ర, కర్ణాటక కళాకారులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.

by Prasanna
kishan reddy on sep 17

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ (Telangana) విమోచన దినోత్సవాన్ని బీజేపీ (BJP) కార్యక్రమంగా పోలీసులు చిత్రీకరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. బీజేపీ కార్యక్రమం అంటూ సర్కులర్ విడుదల చేసిన పోలీస్ అధికారుల పైన కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.

kishan reddy on sep 17

అజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపులో భాగంగా ఈ ఏడాది కూడా విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. ఇందులో భాగంగానే రాంజీ గోండు,  షోయబుల్లా ఖాన్ ల పేరు మీద పోస్టల్ కవర్ ను అమిత్ షా విడుదల చేస్తారని తెలిపారు.

అప్పటీ హైదరాబాద్ సంస్థానం ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉందనీ, మహారాష్ట్ర, కర్ణాటక కళాకారులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. నిజాంకు వ్యతిరేక పోరాటం  చేసిన వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించామని తెలిపారు.

హైదరాబాద్ విమోచన దినోత్సవంకు సంబంధించి వర్చువల్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతున్నామని తెలిపారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు  150 బ్యాటరీ ట్రై సైకిల్ ల పంపిణీ చేస్తామన్నారు.

తెలంగాణ విమోచనా దినమైన సెప్టెంబరు 17నే కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడాన్ని మంత్రి తప్పుపట్టారు. చరిత్రను కనుమరుగు చేసేందుకే ఈ సమావేశాలు అని విమర్శించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద కాంగ్రెస్ నేతలంతా రక్తం కారేలా ముక్కు నేలకు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యా దినోత్సవంగా కేసీఆర్ జరపడాన్ని కిషన్ రెడ్డి తప్పు పట్టారు. 80 వేల పైగా పుస్తకాలు చదివిన కేసీఆర్ తెలంగాణ విమోచనా దినోత్సవానికి జాతీయ సమైక్యత దినోత్సవమని ఎలా పేరుపెడతారన్నారు. దీని పైన బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్ కి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

You may also like

Leave a Comment