Telugu News » Kishan Reddy: తొమ్మిదేళ్లలోనే వేల కోట్లతో రైల్వే అభివృద్ధి: కిషన్‌రెడ్డి

Kishan Reddy: తొమ్మిదేళ్లలోనే వేల కోట్లతో రైల్వే అభివృద్ధి: కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం(Secunderabad to Visakhapatnam)కు వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

by Mano
Kishan Reddy: Railway development with thousands of crores in nine years: Kishan Reddy

తొమ్మిదేళ్లలోనే వేల కోట్లతో రైల్వే అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం(Secunderabad to Visakhapatnam)కు వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకున్నట్లు తెలిపారు.

Kishan Reddy: Railway development with thousands of crores in nine years: Kishan Reddy

ప్రయాణికుల అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ రైలు నడవడం గొప్ప విషయమన్నారు. గడిచిన పదేళ్ల పాటు రైల్వే వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు వెళ్లాయన్నారు. జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు 20 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు.

తెలంగాణలో ఖాజీపేట్ రైల్ కోచ్ ప్రారంభం కాగా చర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రూ.750కోట్ల పనులతో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా నాంపల్లిలో త్వరలో రూ.350కోట్లతో కొత్త రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రూ.85 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని వివరించారు.

త్వరలో కోమరవేల్లి కొత్త స్టేషన్‌కు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. 85 వేల కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 90 శాతం పూర్తి అయిందని, త్వరలోనే టెర్మినల్ ను అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్ శ్రేణిలో వందే భారత్ రైలు ఇది నాలుగవది.

సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. అయితే, ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో కొనసాతోంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ రైలును ప్రవేశ పెట్టారు. మార్చి 13 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది.

 

You may also like

Leave a Comment