Telugu News » NTPC WAR : కిషన్ రెడ్డి ట్వీట్.. కవిత కౌంటర్.. సోషల్ మీడియా వేదికగా వార్..!!

NTPC WAR : కిషన్ రెడ్డి ట్వీట్.. కవిత కౌంటర్.. సోషల్ మీడియా వేదికగా వార్..!!

మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా తెలంగాణకి విద్యుత్‌ను అందిస్తోందని కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15,500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఎన్టీపీసీ ప్లాంట్ కేవలం 680 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే అందిస్తోందని కవిత పేర్కొంది.

by Venu
Kishan Reddy: Congress is winning and holding heads: Kishan Reddy

రాజకీయ నేతలు సోషల్ మీడియాను కూడా వదలడం లేదు.. ఇప్పటి వరకి నోటితో విమర్శించుకున్న వారు.. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా ఘాటైన విమర్శలు చేసుకోవడం తరచుగా కనిపిస్తున్నదే.. ఇక అసెంబ్లీ ఎన్నికలకి ఎక్కువ సమయం లేకపోవడంతో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాలను వేగవంతం చేశారు.. ఈ క్రమంలో వారి వారి వైఫ్యల్యాలను సైతం ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటున్నారు.

అయితే తాజాగా బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan-Reddy)..బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) కవిత (Kavitha) మధ్య సోషల్ మీడియా వార్ (Social Media War)రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా తెలంగాణకి విద్యుత్‌ను అందిస్తోందని కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15,500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఎన్టీపీసీ ప్లాంట్ కేవలం 680 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే అందిస్తోందని కవిత పేర్కొంది.

ఈ లెక్కన రాష్ట్రం వినియోగిస్తున్న విద్యుత్‌లో కేవలం ఇది 4 శాతం మాత్రమే అని కవిత తెలిపారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి అన్న.. కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా తెలంగాణకు విద్యుత్‌ను అందిస్తోందని అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోండని కవిత కౌంటర్ ఇచ్చారు.

మరోవైపు కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌‌లో.. కేంద్ర ప్రభుత్వం.. రూ.6వేల కోట్లతో.. 800 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ పెద్ద పల్లిలోని ఎన్టీపీసీలో అభివృద్ధి చేసిందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా అతి తక్కువ ధరలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం ఎకనమిక్ గ్రోత్ పెంచేందుకు త్వరలో 1600 మెగా వాట్లతో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు.

You may also like

Leave a Comment