Telugu News » Kodandaram: ఉచిత కరెంట్ మొదలుపెట్టిందే కాంగ్రెస్: ప్రొఫెసర్ కోదండరాం

Kodandaram: ఉచిత కరెంట్ మొదలుపెట్టిందే కాంగ్రెస్: ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో పాటు, గృహ వసతికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించనున్నట్లు స్పష్టం చేశారు. నిరంకుశ పాలన పోవాలి, పాలకుల దోపిడీ ఆగాలని పేర్కొన్నారు.

by Mano
kodandaram

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) అన్నారు. వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల(Thunkimetla)లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయని, అందరం ఉమ్మడిగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

kodandaram

అసలు ఉచిత కరెంటు మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని కోదండరాం అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో పాటు, గృహ వసతికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించనున్నట్లు స్పష్టం చేశారు. నిరంకుశ పాలన పోవాలి, పాలకుల దోపిడీ ఆగాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్ వస్తే ‘ధరణి’ తీసేస్తారని బీఆర్ఎస్ ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని కోదండరాం తెలిపారు. ధరణి రాకముందు రాష్ట్రంలో 30 వేల సమస్యలు ఉన్నాయన్నారు. ధరణి వచ్చిన తర్వాత 20 లక్షల సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ ధరణి స్థానంలో దానిని సరిచేస్తూ, కొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకువచ్చి, సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.

పాలమూరు-రంగారెడ్డి రీడిజైన్ వల్ల వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు అన్యాయం జరిగిందని, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అబద్దపు ప్రచారాలతో 1లక్ష, 60 వేలు కొలువులు భర్తీ చేశామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు కేవలం 80 వేలు మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. ఇంకా 1లక్ష 94 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.ఈ పదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment