తెలంగాణ (Telangana)లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు వారి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ ఇష్టదైవాలను పూజించిన తర్వాత నామినేషన్ల పక్రియ మొదలు పెట్టిన విషయాన్ని గమనించే ఉంటాం.. కాగా నామినేషన్ వేయడానికి బీఆర్‌ఎస్ (BRS) అధినేత కూడా సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం (Rajashyamala yagam) నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు సిద్దిపేట (siddipeta) జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం (Konaipalli Venkateswara Swamy)లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ వేయనున్న నేపథ్యంలో పత్రాలను వెంకన్న పాదాల ముందు పెట్టి పూజలు చేసిన కేసీఆర్ అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరోవైపు కేసీఆర్ గజ్వేల్ తో పాటు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మొదటి నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం కేసీఆర్ కి సెంటిమెంట్ గా మారింది. ఇదే ఆనవాయితీ ఈ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు కేసీఆర్. మరి ఈ ఎన్నికల్లో పోటీ చాలా టఫ్ గా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సెంటిమెంట్ ఎంతవరకి వర్కవుట్ అవుతుందో అనే ఆసక్తి రాజకీయాల్లో మొదలైంది.