Telugu News » Koushik Reddy: ప్రభుత్వాన్ని మార్చుదామని కబురు పంపారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Koushik Reddy: ప్రభుత్వాన్ని మార్చుదామని కబురు పంపారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkatreddy) తన దగ్గరికి ఓ మనిషితో కబురు పంపించాడని తెలిపారు.

by Mano
Koushik Reddy: Sent message to change the government: BRS MLA

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి(MLA Koushik Reddy) సంచలన కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌(Karimnagar) లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkatreddy) తన దగ్గరికి ఓ మనిషితో కబురు పంపించాడని తెలిపారు.

Koushik Reddy: Sent message to change the government: BRS MLA

‘నా వెంట 22మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ప్రభుత్వాన్ని మార్చుదాం.. కేసీఆర్‌తో మాట్లాడు’ అని ఆ మనిషితో చెప్పి పంపించారని కౌషిక్ రెడ్డి వెల్లడించారు. అయినా తాను నమ్మలేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అని, కోమటిరెడ్డి ఒక తాగుబోతు అని ఆరోపించారు. అసెంబ్లీకి మద్యం తాగి వస్తున్నాడని మొన్నటి వరకూ పార్లమెంట్‌కు అలానే వచ్చాడంటూ ఆరోపించారు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్‌లో హరీశ్‌రావుతో రాజీనామా చేయించే బాధ్యత తనదని సవాల్ చేశారు.

రుణమాఫీ గనక చేయకుంటే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు సవాల్‌పై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని మండిపడ్డారు. సబ్జెక్ట్ లేని సన్యాసి కోమటిరెడ్డి అని.. కోడి మెదడుతో మాట్లాడుతున్నాడంటూ కౌషిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment