Telugu News » Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్‌కు పాక్ బెదిరింపులు..!

Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్‌కు పాక్ బెదిరింపులు..!

శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి దాఖలైన 18 కేసుల్లో పిటిషనర్లలో ఒకరైన అశుతోష్ పాండే తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్(Facebook Page Hacking) చేశారని ఆరోపించారు.

by Mano
Krishna Janmabhoomi: Pakistan threats to petitioner in Sri Krishna Janmabhoomi case..!

శ్రీకృష్ణ జన్మభూమి కేసు(Srikrishna Janmabhumi Case)లో పిటిషనర్ అశుతోష్ పాండే (Ashutosh Pande)కు ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్ నుంచి బెదిరింపు వచ్చింది. శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి దాఖలైన 18 కేసుల్లో పిటిషనర్లలో ఒకరైన అశుతోష్ పాండే తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్(Facebook Page Hacking) చేశారని ఆరోపించారు.

Krishna Janmabhoomi: Pakistan threats to petitioner in Sri Krishna Janmabhoomi case..!

దీనిపై పాండే.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్ అసభ్యకరమైన విషయాలను రాశారని, పాండేకు ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ నుంచి అనేకసార్లు హత్య బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.

మూడు రోజుల్లో చంపేస్తానని పాకిస్థాన్ నుంచి ఆడియో సందేశం వచ్చిందని తెలిపారు. అయితే, బెదిరింపు తర్వాత వారు పంపిన ఆడియో సందేశాన్ని తొలగించారని పేర్కొన్నారు. పోలీసు సూపరింటెండెంట్ సైబర్ సెల్‌కు తన ఫిర్యాదును అప్పగించారు.

అలహాబాద్ హైకోర్టు గతంలో ఈ విషయంలో (కోర్టు సర్వే) ఉత్తర్వులు ఇచ్చింది. అయితే షాహి ఈద్గా కమిటీ అన్ని కేసులను మథుర జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకించింది. తదుపరి విచారణ 2024 జనవరి 23న సుప్రీంకోర్టులో జరగనుంది.

You may also like

Leave a Comment