Telugu News » KTR : బీజేపీ వాషింగ్ మెషీన్‌ కొనండి సోరెన్ జీ.. బీజేపీపై కేటీఆర్ సెటైర్..!

KTR : బీజేపీ వాషింగ్ మెషీన్‌ కొనండి సోరెన్ జీ.. బీజేపీపై కేటీఆర్ సెటైర్..!

గతంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. ఇది జరిగిన కొద్దిసేపటికే భూకబ్జా కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.

by Venu
Jharkhand CM Hemant Soren Asked To Join ED Probe On August 24

ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ (Modi) ప్రభుత్వంలో కేంద్ర ఏజెన్సీలు సమర్పించిన పనిమాలిన చిన్న ప్రూఫ్ ల ఆధారంగా ముఖ్యమంత్రిని కూడా ఎలా జైలులో పెట్టవచ్చో తెలుపడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ప్రస్తుత పరిస్థితి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు..

ktr says telangana people observing governors attitudeఓ ప్రముఖ న్యూస్ యాప్ ప్రచురించిన వార్తకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) మనీ లాండరింగ్ కేసులో సమర్పించిన ఆధారాలపై ఎక్స్ (X) వేదికగా సెటైర్ వేసిన కేటీఆర్. ఇందులో హేమంత్ సోరెన్ జీ, ఫ్రిడ్జ్, స్మార్ట్ టీవీకి బదులుగా బీజేపీ (BJP) వాషింగ్ మెషీన్ ని కొనుగోలు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గతంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. ఇది జరిగిన కొద్దిసేపటికే భూకబ్జా కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రూ.31 కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని సొరెన్ అక్రమంగా సంపాదించారని ఈడీ వాదించింది. వీటికి సంబందించి ఆదారాలుగా ఫ్రిడ్జ్, స్మార్ట్ టీవీ ఇన్ వాయిస్ లను చూపించింది.

జేఎమ్ఎమ్ నాయకుడితో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన చార్జ్ షీట్ లో వీటిని జత చేసింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచులు విసరడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. బీజేపీ వల్లే ఇదంతా జరుగుతుందని భావించిన ఆయన ఇప్పటికే పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..

You may also like

Leave a Comment