Telugu News » KTR: కాంగ్రెస్ చేతగాని తనం రైతులకు అర్థమైంది: కేటీఆర్

KTR: కాంగ్రెస్ చేతగాని తనం రైతులకు అర్థమైంది: కేటీఆర్

తెలంగాణ(Telangana)లో వర్షపాతం(rainfall) నమోదుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల కేటీఆర్ ఫైర్ అయ్యారు.

by Mano
KTR Tweet: 'Hand of lies..'KTR hundred questions to Congress..!!

కాంగ్రెస్ సర్కార్(Congress Government) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆ పార్టీ చేతగాని తనం రైతులకు అర్థమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. తెలంగాణ(Telangana)లో వర్షపాతం(rainfall) నమోదుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల ఫైర్ అయ్యారు.

KTR: Farmers understand that it is not Congress' power: KTR

వర్షపాతంపై రేవంత్‌ చెప్తున్నదంతా అబద్ధాలేనని కేటీఆర్ తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14శాతం ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైందని వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌(X) వేదికగా కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

నీటి సమస్యలు తీర్చే సామర్థ్యం లేక లోటు వర్షపాతమంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు సత్యదూరమైన మాట్లాడటం పట్ల తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని తెలిపారు.

ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14శాతం ఎక్కువ వర్షపాతం తెలంగాణలో నమోదైందని కేటీఆర్ పేర్కొన్నారు. నీటి సమస్యలని తీర్చడం చేతకాక లోటు వర్షపాతం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలు తీర్చడం మాట అటుంచి, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమయ్యిందంటూ విమర్శించారు.

You may also like

Leave a Comment