Telugu News » MLC Kavitha : లిక్కర్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..!

MLC Kavitha : లిక్కర్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..!

ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని తెలిపిన కవిత.. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద శుక్రవారం దీక్ష చేస్తామని ప్రకటించారు.

by Venu
Kavitha from Tihar Jail is another sensation.. Together with a letter to Judge Kaveri Bhaveja!

తెలంగాణ (Telangana) సీఎం పై బీఆర్ఎస్ (BRS) నేతలు వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికగా.. రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సైతం మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించిన ఆమె.. ముఖ్యమంత్రి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆరోపించారు.

brs mlc kavita petition postphone on februrary 28 th on liquor case

రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోడీతో స్నేహం ఉందని విమర్శించిన కవిత.. రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో ఎప్పటికైనా కాంగ్రెస్ (Congress)కు నష్టమని ఆరోపించారు. పలు గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం మాట్లాడుతున్న భాషపై కేసులు పెట్టాలన్నారు. బీఆర్‌ఎస్‌, లోక్‌సభ ఎన్నికల్లో గెలవకపోతే ప్రజలకే నష్టమని పేర్కొన్నారు.. రెండు జాతీయ పార్టీలూ బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు.

ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని తెలిపిన కవిత.. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద శుక్రవారం దీక్ష చేస్తామని ప్రకటించారు. మరోవైపు సీతక్క (Seetakka)కు డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేసిన కవిత.. ఆమెకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

రేవంత్ పాలనలో అడుగడుగునా.. అనుభవరాహిత్యం, అవగాహన లోపం కనిపిస్తుందని విమర్శించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన ఖర్మ అని పేర్కొన్నారు.. లిక్కర్ కేసు (Liquor Case)…పెద్ద కేసు కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన కవిత.. ఈ కేసును డైలీ సీరియల్లా లాగుతున్నారని విమర్శించారు.. ఈ కేసులో నేను నేను బాధితురాలిని.. ఫైట్ మాత్రమే చేస్తా అని అన్నారు. మిగతా విషయాలు మా లీగల్ టీం చూసుకొంటుందని తెలిపారు..

You may also like

Leave a Comment