Telugu News » KTR : నిస్సహాయ స్థితిలో కేటీఆర్.. తన కామెంట్స్ వెనుక మర్మం ఎవరికీ తెలియదనుకున్నారా?

KTR : నిస్సహాయ స్థితిలో కేటీఆర్.. తన కామెంట్స్ వెనుక మర్మం ఎవరికీ తెలియదనుకున్నారా?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకు కారణం ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న కామెంట్స్ అని సొంత పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా నిజంగా దొంగతనం చేసినా ఎదుటి వాడు ప్రశ్నిస్తే నేను దొంతనం చేయలేదనే వాదిస్తాడు.

by Sai
KTR in a helpless state.. Does anyone want to know the secret behind his comments?

కానీ, కేటీఆర్ మాత్రం నిస్సందేహంగా అవును..మేం తప్పులు చేశాము అని ఒప్పుకోవడం.. అయితే ఇపుడేంటి? అన్నట్లు మాట్లాడటం వెనుక ‘ధైర్యం,మళ్లీ అధికారంలోకి వస్తాం అనే నమ్మకం’ కంటే నిస్సహాయతే ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడం, గతంలో తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం డ్యామేజ్? వీటన్నింటిపై రేవంత్ సర్కార్ విచారణ జరిపిస్తోంది.

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు అంతా అరెస్ట్ అయ్యారు.హెచ్ఎండీఏ(HMDA)లో దాదాపు రూ.1000 కోట్ల నిధుల గోల్‌‌మాల్‌ కేసులో శివబాలకృష్ణ అరెస్టు, ఫార్ములా రేస్ స్కాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే రూ.50కోట్లు బదిలీ చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ వాంగ్మూలం ఇవ్వడంతో ఆయన లోలోపల భయపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

తర్వాత దర్యాప్తు సంస్థలు తన వద్దకే వస్తాయని కేటీఆర్కు కూడా ఇప్పటికే సమాచారం కూడా ఉందని టాక్.శుక్రవారం ప్రెస్‌మీట్లో భాగంగా సీఎం రేవంత్ మరోసారి కేటీఆర్‌ను హెచ్చరించారు. కేటీఆర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయం అని స్వయంగా సీఎం చెప్పడం దేనికి సంకేతం..కేటీఆర్ వరకు దర్యాప్తు సంస్థలు వస్తే తమ వద్దకు రాలేవా? అని ముందే గ్రహించిన గులాబీ లీడర్లు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ పంచన చేరి అరెస్టు నుంచి, తమ అక్రమ సంపాదనను కాపాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ ఏం పీక్కుంటాడో నేను చూస్తా..అంతపెద్ద కాలేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే ఏమైంది? ఒకటో రెండో ఫోన్ ట్యాపింగ్ చేశాం.. పక్కా లంగాగాళ్లవి చేస్తాం కానీ అందరివి ఎందుకు చేస్తాం.. లక్ష కాల్ రిక్డార్డ్స్ చేశారని బీఆర్ఎస్‌పై నిందలు వేస్తున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్ వెనుక నిస్సహాయతతో పాటు భయం కూడా ఉందని ప్రస్తుత రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

You may also like

Leave a Comment