Telugu News » CONGRESS : నాడు బీఆర్ఎస్..నేడు కాంగ్రెస్‌‌కు నేతల క్యూ.. సీఎం రేవంత్‌కు ఫ్యూచర్ అర్థమవుతోందా?

CONGRESS : నాడు బీఆర్ఎస్..నేడు కాంగ్రెస్‌‌కు నేతల క్యూ.. సీఎం రేవంత్‌కు ఫ్యూచర్ అర్థమవుతోందా?

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను చూస్తుంటే గతంలో పదేళ్ల పాటు అధికారం చేపట్టిన బీఆర్ఎస్(BRS) విధి విధానాలనే నేడు కాంగ్రెస్(CONGRESS) పార్టీ కూడా అవలంభిస్తోందని స్పష్టంగా అర్థం అవుతోంది.రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. తెలంగాణ ప్రజానీకం(TELANGANA PEOPLE) ఏ నేతలను అయితే రిజెక్ట్ చేశారో వారినే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తోంది.ఇదంతా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

by Sai
cmrevanth

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను చూస్తుంటే గతంలో పదేళ్ల పాటు అధికారం చేపట్టిన బీఆర్ఎస్(BRS) విధి విధానాలనే నేడు కాంగ్రెస్(CONGRESS) పార్టీ కూడా అవలంభిస్తోందని స్పష్టంగా అర్థం అవుతోంది.రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. తెలంగాణ ప్రజానీకం(TELANGANA PEOPLE) ఏ నేతలను అయితే రిజెక్ట్ చేశారో వారినే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తోంది.ఇదంతా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

cmrevanth

 

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దఎత్తున చేరికలు(LEADERS JOININGS) జరిగాయి.వారు పదేళ్ల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటేడ్ పోస్టులో కీలకపాత్ర పోషించారు. గతంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌తో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.గత సర్కార్ చేసిన తప్పిదాలు, అక్రమాలు, అవినీతి కారణంగా ప్రజలు విరక్తి చెంది ఆ పార్టీని గద్దె దించారు.

గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలనే రేవంత్ సర్కారు కూడా చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్‌లో పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు ఏదో ఒక హామీతో కాంగ్రెస్లో చేరుతున్నారు. వీరందరికి రేవంత్ పదవులు ఎలా ఇస్తారు? పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతలు
దూరమైనా కేడర్ మాత్రం పార్టీకోసమే పనిచేశారు.

ఇప్పుడు పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తే సామాన్య కార్తకర్తల పరిస్థితి ఏమిటి? గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఉద్యమకారులు, పార్టీ కోసం రక్తం దారబోసిన వారిని కాదని పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఫలితంగా ఉద్యమకారులు నష్టపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు, నామినేటేడ్ పోస్టులు, ఎంపీ టికెట్లు ఇస్తే ఫలితంగా కాంగ్రెస్ పార్టీనే ఎంతో కాలంగా నమ్ముకుని ఉన్న సీనియర్లు, కేడర్ నష్టపోవాల్సి వస్తుంది.

వలస నేతలు అనేవారు అధికారం ఉన్నంత వరకే ఉంటారని సీఎం రేవంత్ గుర్తుపెట్టుకుంటే మంచిదని సొంతపార్టీ కేడర్ సూచిస్తోంది. తర్వాత రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు పార్టలో చేరిన వారంతా అందులోకి వెళ్లిపోరని గ్యారెంటీ ఏంటి? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని, ఆ పార్టీ శ్రేణులు కీలక నేతల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.చేరికలు రేవంత్ సర్కారుకు ప్లస్సే కాదు.. మైనస్ కూడా అనే విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

You may also like

Leave a Comment