Telugu News » Razakar : రజాకార్..!కేటీఆర్..!! ఎందుకింత హాహాకార్!? హిందూ సంఘాల సూటి ప్రశ్న

Razakar : రజాకార్..!కేటీఆర్..!! ఎందుకింత హాహాకార్!? హిందూ సంఘాల సూటి ప్రశ్న

రజాకార్ సినిమాను యాటా స‌త్య‌నారాయ‌ణ తెరకెక్కించగా.. గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించారు. ఇప్పటిదాకా తెలంగాణ సాంస్కృతిక వైభవం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే.. నిజాం అరాచకాలపై సినిమాలు పెద్దగా లేవు.

by admin
ktr on Razakar Movie 1

– సంచలనం రేపుతున్న రజాకార్ మూవీ టీజర్
– నిజాం పాలనలో హిందువులపై..
– జరిగిన దారుణాలను వివరిస్తూ సినిమా
– కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ముబాషిర్ ట్వీట్
– బీజేపీ నేతలపై మంత్రి ఫైర్
– కేటీఆర్ తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం
– హిందువులపై జరిగిన అకృత్యాలను చూపిస్తే..
– ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని సూటి ప్రశ్న

తెలంగాణ (Telangana) విమోచన దినోత్సవం సందర్భంగా రజాకార్ (Razakar) మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ను గమనిస్తే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన టైంలో తెలంగాణలో హిందువులపై జరిగిన అరాచకాలను కళ్ళకి కట్టినట్టు చూపించారు. మెయిన్ లీడ్స్ ను ఎక్కువగా చూపించకపోయినా.. కథ, నేపథ్యం ఏంటో చెప్పారు. అయితే.. ఇందులో ముస్లిం వర్గాన్ని తప్పుగా చూపించారని వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ముబాషిర్ అనే జర్నలిస్ట్.. మంత్రి కేటీఆర్ (KTR) ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. సినిమా (Movie) రిలీజ్ ను ఆపేయాలని కోరాడు.

ktr on Razakar Movie

ముబాషిర్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘కొంతమంది తెలివి విషయంలో దివాలా తీసిన బీజేపీ (BJP) జోకర్స్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రజాకార్​ సినిమా విషయం సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారకుండా చూసుకుంటారు” అంటూ కేటీఆర్ తెలిపారు.

రజాకార్ సినిమాను యాటా స‌త్య‌నారాయ‌ణ తెరకెక్కించగా.. గూడూరు నారాయ‌ణ రెడ్డి (Narayana Reddy) నిర్మించారు. ఇప్పటిదాకా తెలంగాణ సాంస్కృతిక వైభవం మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే.. నిజాం అరాచకాలపై సినిమాలు పెద్దగా లేవు. కొన్నింటిని తీసినా అంతగా హైలైట్ కాలేదు. రజాకార్ సినిమాను పెద్ద సినిమా రేంజ్ లో చిత్రీకరించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా 2024లో రిలీజ్ కానుంది.

ఈ చిత్రంపై ముస్లింలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఆనాటి రజాకార్ల రాక్షసత్వాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని, హిందువుల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు రజాకార్ సినిమాలో చూపించారని.. ఇందులో తప్పేముందనేది హిందూ సంఘాల వాదన. నిజాం పాలనలో హిందువులపై జరిగిన దాడులపై పూర్తిస్థాయి సినిమాలు రాలేదని.. ఇన్నాళ్లకు ఆనాటి దారుణ అకృత్యాలను చూపిస్తూ రజాకార్ చిత్రం తీస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాయి. హిందువులపై బీఆర్ఎస్ కు బాధ్యత లేదా? అని నిలదీస్తున్నాయి. కేటీఆర్ తీరును తప్పుబడుతున్న హిందూ సంఘాలు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాయి. హిందువులను.. హిందూ దేవుళ్ళను అవమానించేలా సినిమాలు తీస్తే మౌనం, ఇతర మతస్తులపై ఈగ వాలితే గగ్గోలు.. కొందరు పెక్యులరిస్ట్ లకు అలవాటుగా మారిపోయిందని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు.

You may also like

Leave a Comment