Telugu News » modi: ఏపీ, తెలంగాణ విభజన గురించి ప్రత్యేక సమావేశాల్లో మోడీ ప్రస్తావన…!

modi: ఏపీ, తెలంగాణ విభజన గురించి ప్రత్యేక సమావేశాల్లో మోడీ ప్రస్తావన…!

ఆంధప్రదేశ్ విభజన అంశాన్ని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రస్తావించారు.

by Ramu
delhi parliament special session pm modi comments on ap telangana bifurcation

ఆంధప్రదేశ్ విభజన(ap bifurcation) అంశాన్ని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ(pm modi) ప్రస్తావించారు. తెలంగాణ(Telangana) ఏర్పాటు ఎంతో ప్రాయసతో జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని పేర్కొన్నారు. ఇరు వర్గాలను రాష్ట్ర విభజన సంతృప్తి పరచలేకపోయిందన్నారు. కొత్త రాష్ట్రం(new state) వచ్చినా తెలంగాణ సంబురాలు చేసుకోలేకపోయిందన్నారు.

delhi parliament special session pm modi comments on ap telangana bifurcation

తెలంగాణ విభజనకు, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల విభజన మధ్య చాలా తేడాలు వున్నాయని మోడీ తెలిపారు. వాజ్ పాయ్ ప్రధానిగా వున్న సమయంలో ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల విభజన సమయంలో చాలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించి చర్యలు తీసుకున్నారని తెలిపారు.

ఆయా రాష్ట్రాల్లో అన్ని వర్గాల మధ్య సంతృప్తిని, విస్తృతంగా వేడుకలు జరుపుకునేలా అప్పటి ప్రధాని వాజ్ పాయ్ చేశారని ఆయన వివరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అలాంటి పంథాలో నడవలేదన్నారు. ఫలితంగా అంతగా సామరస్యపూర్వకమైన ఫలితం రాలేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో చాలా మంది బలిదానాలు చేసుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో ప్రజలు సంబురాలు చేసుకోలేకపోతున్నారన్నారు. గతంలో 2022లోనూ లోక్ సభలో ప్రధాని ఏపీ విభజన గురించి ప్రస్తావించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఏపీని యూపీఏ హడావుడిగా విభజించిందన్నారు.

You may also like

Leave a Comment