అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షాల విషయంలో ఏ చిన్న అంశం దొరికినా వాటిని విమర్శలుగా మలచుకుని ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా జరిగే సమావేశంలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం అనే ధీమాను ప్రదర్శిస్తుంది. మరోవైపు మంత్రి కేటీఆర్ (KTR)కూడా హ్యాట్రిక్ సాధించడం ఖాయంటూ చేసిన అభివృద్థి గురించి ప్రసంగాలు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)పార్క్ హయత్ హోటల్ (Park Hyatt Hotel)లో సీఎంఎస్‌టీఈఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెట్ మీట్ లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి పాల్గొన్న కేటీఆర్.. ఎదగాలనే ఆలోచన ముఖ్యం కాదు.. ఎదగడానికి కావలసిన పట్టుదల ముఖ్యం.. ఓటమి ఎదురైనప్పుడు మరింత ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలనే సంకల్పం బలంగా ఉంటే.. ఓటమి కూడా తలవంచుతుందని అన్నారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శమని కేటీఆర్ తెలిపారు. టాలెంట్ ఉంటే ఏ కులంలో ఉన్నా సక్సెస్ సాధించవచ్చని పేర్కొన్నారు. 500 మంది వ్యవస్థాపకులుగా CMSTEI కార్యక్రమం ద్వారా మారారని ఈ సందర్భంగా తెలిపారు.. సక్సెస్ అయిన ప్రతీ ఒక్కరు తమ కథలను తండాలలో అందరికీ అర్థం అయ్యేలా వివరించాలని పేర్కొన్నారు.
మరోవైపు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్నోవేషన్ స్కీమ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.