Telugu News » KTR : కాంగ్రెస్ ఇష్టపూర్వకంగా రాష్ట్రాన్ని ఇవ్వలేదు!

KTR : కాంగ్రెస్ ఇష్టపూర్వకంగా రాష్ట్రాన్ని ఇవ్వలేదు!

కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చిందని.. ఇష్టపూర్వకంగా జరగలేదన్నారు కేటీఆర్. 55 ఏండ్లలో చేతకాలేదు కానీ, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

by admin
ktr-sensational-words-on-sirisilla-politics

అభివృద్ధిని చూసి ఓటేయాలని సూచించారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటం లేదని విమర్శించారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే.. కుల, మతాల పేరుతో ముందుకు వస్తారని మండిపడ్డారు. కులం, మతం కాదు గుణం చూసి ఓటెయ్యాలని కోరారు.

ktr-sensational-words-on-sirisilla-politics

‘‘అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం.. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి’’ అని అన్నారు కేటీఆర్. కేసీఆర్ న్యాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని.. సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాదిస్తున్నామని చెప్పారు. ఇంతకష్టపడి సాధించుకుని.. ఓటుకు నోటు దొంగకు అప్పగిద్దామా? అని అడిగారు. మెడ మీద తల ఉన్నోడు ఎవడైనా అతడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చిందని.. ఇష్టపూర్వకంగా జరగలేదన్నారు కేటీఆర్. 55 ఏండ్లలో చేతకాలేదు కానీ, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఎలక్షన్ అన్నపుడు ఆగం కాకుండా ఆచితూచి అడుగులు వేయండి.. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు సీఎంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ కు 11 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏం చేయలేదన్నారు.

యువత సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ కోసం పని చేయాలని సూచించారు కేటీఆర్. ప్రతి రోజు దినచర్య స్టార్ట్ అయ్యేది సోషల్ మీడియాతోనేనని చెప్పారు. సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చూపిస్తున్నారని విమర్శించారు. యువత ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. అభివృద్ధి చేయడానికి తమకు కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని ఓటర్లకు చెప్పాలని కోరారు. ఒకప్పుడు బతుకమ్మ ఆడుకోవాలంటే ఒక కొలను తవ్వి బతుకమ్మలు వేసుకునే వాళ్లని.. ఇప్పుడు, 24 గంటలు తంగాళ్లపల్లి బ్రిడ్జి కింద నీళ్లు ఉంటున్నాయని తెలిపారు కేటీఆర్.

You may also like

Leave a Comment