Telugu News » Seized Gold: రూ.4.50కోట్ల విలువ గల బంగారం పట్టివేత.. ఎక్కడంటే..!

Seized Gold: రూ.4.50కోట్ల విలువ గల బంగారం పట్టివేత.. ఎక్కడంటే..!

తెలంగాణ, కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా స్కార్పియో వాహనంలో తరలిస్తున్న ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

by Mano
Seized Gold: Seized gold worth Rs.4.50 crores.. Where is it..!

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు(Telangana police) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చేస్తున్న సోదాల్లో భారీ స్థాయిలో బంగారం పట్టుబడుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా(SangaReddy dist) జహీరాబాద్(Jaheerabad) మండలం చిరాగ్‌పల్లి(chiragpalli) అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసు తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది.

Seized Gold: Seized gold worth Rs.4.50 crores.. Where is it..!

తెలంగాణ, కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా స్కార్పియో వాహనంలో తరలిస్తున్న ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.4.50కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు బిస్కెట్లు సహా ఆభరణాల రూపంలో బంగారం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి.. ఎన్నికల అధికారులకు అప్పగించనున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్ఐ నరేశ్ తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రోజూ బంగారం, నగదు, వెండి వస్తువులు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.350కోట్ల మేర విలువైన నగదు, నగలను పోలీసులు సీజ్ చేశారు. బంగారం, నగదుతో పాటు అక్కడక్కడ డ్రగ్స్‌ పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

You may also like

Leave a Comment