Telugu News » KTR : మైనంపల్లికి కేటీఆర్ కౌంటర్

KTR : మైనంపల్లికి కేటీఆర్ కౌంటర్

చాలాకాలంగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు టికెట్ వస్తుందని హన్మంతరావు ఆశించారు. చివరి నిమిషంలో మెదక్ స్థానం నుంచి పద్మా దేవేందర్ పేరు ఖరారు అయింది.

by admin
KTR Serious on MLA Mynampally Hanumantha Rao

– హరీష్ రావుపై రెచ్చిపోయిన మైనంపల్లి
– మెదక్ లో మంత్రి పెత్తనం ఏంటని ఆగ్రహం
– నియంతలా మారారంటూ విమర్శలు
– మైనంపల్లి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్
– హరీష్ కే తమ మద్దతు అంటూ ప్రకటన

బీఆర్ఎస్ (BRS) లో అసమ్మతి సెగలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Hanmantharao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావు (Harish Rao)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై మంత్రి కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావుకే పార్టీ శ్రేణులు అండగా ఉండాలని స్పష్టం చేశారు.

KTR Serious on MLA Mynampally Hanumantha Rao

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి.. బీఆర్‌ఎస్ టికెట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ లో మంత్రి హరీష్ రావు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి నియంతగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. సిద్దిపేట మాదిరిగా మెదక్‌ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాను అభివృద్ధి కాకుండా చేశారని ఆరోపించారు. తన కుమారుడిని మెదక్ ఎమ్మెల్యే చేయడమే లక్ష్యంగా ఉన్నానన్న ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

మెదక్, మల్కాజ్‌ గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తామని.. లేదంటే ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతామన్నారు మైనంపల్లి. కరోనా సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని.. దాదాపు రూ.8 కోట్ల వరకు సొంత డబ్బు ఖర్చు చేశాడని వివరించారు. తాము అనుకున్నట్టు జరగకపోతే.. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని హెచ్చరించారు. తాను బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నానని.. టికెట్‌ కూడా డిక్లేర్‌ చేశారని తెలిపారు.

చాలాకాలంగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు టికెట్ వస్తుందని హన్మంతరావు ఆశించారు. చివరి నిమిషంలో మెదక్ స్థానం నుంచి పద్మా దేవేందర్ పేరు ఖరారు అయింది. దీని వెనుక హరీష్ రావు ఉన్నారని మైనంపల్లి ఇలా రియాక్ట్ అయి ఉంటారని అంటున్నారు.

కేటీఆర్ కౌంటర్

హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మైనంపల్లి హన్మంతరావు పేరును ప్రస్తావించకుండానే ట్వీట్ చేశారు కేటీఆర్. హరీష్ రావుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, ఎమ్మెల్యే ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

You may also like

Leave a Comment