Telugu News » KTR : ఆస్తులు కాపాడుకోవడానికే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు.. రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..!

KTR : ఆస్తులు కాపాడుకోవడానికే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు.. రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..!

కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతారనుకోవడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందని కేటీఆర్ ఆరోపించారు..

by Venu
brs party will win in next loksabha elections says chevella mp ranjith reddy

అధికార కాంగ్రెస్ (Congress)లోకి బీఆర్ఎస్ (BRS) నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ (KTR).. కీలక వ్యాఖ్యలు చేశారు.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచి కాంగ్రెస్ కు షాకిద్దామని భావిస్తున్న క్రమంలో అసలు బీఆర్ఎస్ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనిపించకుండా పోతుందని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక ఈ వ్యాఖ్యలపై గట్టిగానే స్పందించిన చిన్న బాస్ పార్టీ మారిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు..

చేవెళ్ల (Chevella) పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మైన కేటీఆర్.. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. కేవ‌లం అధికారం, ఆస్తుల కోస‌మే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరార‌ని ఆరోపించారు.. అదేవిధంగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించుకొన్న అనంతరం రంజిత్ ఎవరో ప్రపంచానికి తెలిసిందని మండిపడ్డారు..

రాజకీయాల్లోకి రంజిత్ రెడ్డి (Ranjith Reddy) 2019లో వచ్చారు.. అయినా అదేమీ ఆలోచించకుండా ప్ర‌తి కార్య‌క‌ర్త క‌ష్ట‌ప‌డి ఆయన గెలుపుకు కృషి చేశారు.. కానీ ఇదంతా మరచిన ఆయన.. బీఆర్ఎస్ కి ద్రోహం చేశారని దెప్పిపొడిచారు.. క‌విత (Kavitha) త‌న సోద‌రి అని చెప్పుకునే రంజిత్.. ఆమెను అరెస్టు చేసిన రోజే న‌వ్వుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థ‌ప‌రుడని ధ్వ‌జ‌మెత్తారు.

రేవంత్ రెడ్డి (Revanth Reddy), రంజిత్ రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన.. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతారనుకోవడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందని కేటీఆర్ ఆరోపించారు.. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని విమర్శించారు.. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు..

You may also like

Leave a Comment