Telugu News » KTR : KTR : రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది.. రేవంత్ సర్కార్ మౌనం వీడాలన్న కేటీఆర్..!

KTR : KTR : రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది.. రేవంత్ సర్కార్ మౌనం వీడాలన్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ప్రయోనాలు కేంద్రానికి తాకట్టు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రూ.47,65,768 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఎలాంటి కొత్త పథకాలు, వరాలు, వాతలు లాంటి భారాలు లేకుండానే మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ ప్రవేశపెట్టారు.

by Venu

కేంద్రం ఆర్ధిక మంత్రి (Union Finance Minister) సీతారామ‌న్ (Sitharaman) ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ లో తెలంగాణ‌ (Telangana)కు ఎలాంటి కేటాయింపులు క‌నిపించ‌లేదు. ఎటువంటి గ్రాంట్స్, నిధులు ఇస్తున్న‌ట్లు పేర్కొన‌లేదు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

Ktr fire on bjp and Congress

రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు మౌనంగా ఉన్నారని ట్విట్టర్ (X) వేదికగా ప్రశ్నించారు. తెలంగాణకు రావలసిన బ‌డ్జెట్ పై బీజేపీ (BJP)ని ప్రశ్నించడానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని అన్నారు. KRMB కి అన్యాయంగా తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించారన్న కేటీఆర్.. వీటిపై రేవంత్ సర్కార్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోనాలు కేంద్రానికి తాకట్టు పెడతారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రూ.47,65,768 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఎలాంటి కొత్త పథకాలు, వరాలు, వాతలు లాంటి భారాలు లేకుండానే మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా కింద రూ.25,639 కోట్లు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు కేటాయించారు.

ఈసారి మరో రూ.2,239 కోట్లను పెంచింది. అదీగాక కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు రానున్నాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక సంస్థల గ్రాంటు కింద రాష్ట్రానికి మరో రూ.3,200 కోట్లు రానున్నాయి. ఈ మూడు పెద్ద పద్దులు తప్ప రాష్ట్రానికి ఈసారి చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీలేవు. ఈ నేపథ్యంలో వీటిపై రేవంత్ సర్కార్ నోరు మేదపకపోవడంపై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.

You may also like

Leave a Comment