Telugu News » Kuno National Park : ఐదు కాదు.. ఆరు చిరుత కూనలు జననం..!

Kuno National Park : ఐదు కాదు.. ఆరు చిరుత కూనలు జననం..!

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో ఇటీవలే ఐదు పిల్లలకు (Cheetah cubs) జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు చిరుత కూనలకు జన్మనిచ్చినట్లు తాజాగా వెల్లడైంది.

by Mano
Kuno National Park: Not five.. six leopard cubs born..!

దక్షిణాఫ్రికాలోని కలహరి (Tswalu Kalahari) టైగర్‌ రిజర్వ్‌ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని (Gamini) ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో ఇటీవలే ఐదు పిల్లలకు (Cheetah cubs) జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు చిరుత కూనలకు జన్మనిచ్చినట్లు తాజాగా వెల్లడైంది.

Kuno National Park: Not five.. six leopard cubs born..!

ఈ విషయాన్ని కేంద్రం మంత్రి భూపేందర్‌ యాదవ్‌ (Bhupender Yadav) సోమవారం ఉదయం ఎక్స్‌(X) వేదికగా వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియోను పంచుకున్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ “చాలా సంతోషంగా ఉంది. ఇవి ఐదు కాదు. ఆరు పిల్లలు..! ఇది మొదటిసారి తల్లికి ఒక రకమైన రికార్డు. తొలిసారి తల్లి అయిన గామిని.. 6 పిల్లలకు జన్మనిచ్చిన తొలి ఆడ చిరుతగా నిలిచింది. ఇప్పటివరకు గరిష్ట సంఖ్య 5 మాత్రమే..’’ అని పేర్కొన్నారు.

గామిని ఐదు పిల్లలకు జన్మనిచ్చిన వార్త తర్వాత ఒక వారం తర్వాత దక్షిణాఫ్రికా చిరుత తల్లి గామిని ఆరు పిల్లలకు జన్మనిచ్చిందని ఇప్పుడు ధృవీకరించబడిందని ఆయన వెల్లడించారు. భారత్‌లో చిరుతలను స్థిరపరచడానికి ‘ప్రాజెక్ట్ చిరుత’ ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు కింద నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దశల్లో 20 చిరుతలను తీసుకువచ్చారు.

వీటిలో మొత్తం ఏడు చిరుతలతో పాటు కునోలో పుట్టిన 13 పిల్లలు మృత్యువాతపడ్డాయి. తాజాగా గామిని ఆరు కూనలకు జన్మనివ్వడంతో.. భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 14కు పెరిగింది. ప్రస్తుతానికి కునో నేషనల్‌ పార్కులో మొత్తం చిరుత పులుల సంఖ్య 27కు చేరింది. గామిని పిల్లలు పుట్టకముందే ఈ ఏడాది జనవరిలో ఆడ చిరుత ఆశా 3 పిల్లలకు జన్మనిచ్చింది.

You may also like

Leave a Comment