తిరుమల (Tirumala)లో అధికారులు పెట్టిన చిరుత (leopard) ట్రాప్ బాక్స్ లో మరో చిరుత చిక్కింది. దీంతో గత 75 రోజుల్లో తిరుమల నడక దారిలో చిక్కిన ఐదో చిరుత ఇది. 10 రోజుల క్రిత్తమే ట్రాప్ (Trapped) కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించారు. నరసింహ స్వామి ఆలయం, 7వ మైలుకి మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో 5 చిరుతలను అటవీ అధికారులు బంధించారు.
ఇప్పటికే జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28 తేదీలలో ఇప్పటికే నాలుగు చిరుతలు చిక్కాయి. అలిపిరి నడక దారిలో ఈ ఏడాది జూన్ 22, ఈనెల 11వ తేదీ చిన్నారులు కౌశిక్, లక్షితలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన బోనుల్లో ఇప్పటి వరకూ ఐదు చిరుతలు చిక్కాయి.
తొలుత పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు అత్యంత సమీపంలోనే విడిచిపెట్టేయగా రెండవసారి, మూడవసారి పట్టుబడ్డ చిరుతలను జూపార్కులో ఉంచారు. నాలుగవ చిరుత విషయం తెలియలేదు.
గతంలో పట్టుబడిన నాలుగు చిరుతలూ మగవేనని అధికారులు చెబుతున్నారు. మొదటి మూడు పులులూ రెండు నుంచీ మూడేళ్ళ లోపు వయసు కలిగి వున్నాయని, నాలుగోది మాత్రం ఐదారేళ్ళ వయసు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.