Telugu News » Libya: ప్రధాని నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి..!

Libya: ప్రధాని నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి..!

ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న పౌరులు చెప్పినట్లు రాయిటార్స్ తెలిపింది. వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

by Mano
Libya: Rocket grenade attack on Prime Minister's residence..!

లిబియా (Libya) ప్రధాని అబ్దుల్ హమీద్ అల్-దబేబా(Abdul Hamid Al-Dabeba)నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి(Rocket grenade Attack) జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి ఒకరు వెల్లడించారు. ప్రధాన మంత్రి(PM) భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.

Libya: Rocket grenade attack on Prime Minister's residence..!

ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న పౌరులు చెప్పినట్లు రాయిటార్స్ తెలిపింది. వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. లిబియాలో 2021 నుంచి రాజకీయ అస్థిరత నెలకొంది. అబ్దుల్ హమిద్ అల్- దబేబా నేతృత్వంలోని నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి 2021లో ఏర్పాటు చేసింది.

కానీ, ఆ ఏడాది చివరికల్లా తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ దీన్ని అధికారికంగా గుర్తించడానికి నిరాకరించింది. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల నిర్వహణను సజావుగా చేపట్టేలా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దేశంలోని ముగ్గురు కీలక నేతలు చెప్పారు. మార్చి ఆరంభంలో ఈవిషయాన్ని అంగీకరించారు.

కానీ, ప్రధాని మాత్రం ఎన్నికలు జరిగే వరకు పదవి నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో ఆయన నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. లిబియాలో  2011 నుంచి శాంతిభద్రతల సమస్యలు కొనసాగుతున్నాయి. పాలనపై పట్టుకోసం 2014లో తూర్పు, పశ్చిమ కింద వైరి వర్గాలు ఏర్పడి ఎవరికి వారు సొంతంగా పాలనను కొనసాగిస్తున్నాయి. 2021లో అబ్దుల్ హమీద్ అల్-కొనసాగిస్తున్నాయి.

You may also like

Leave a Comment