Telugu News » Lightning, 10 died in Odissa: పిడుగుపాటుకు ఆరు జిల్లాల్లో 10 మంది మృతి

Lightning, 10 died in Odissa: పిడుగుపాటుకు ఆరు జిల్లాల్లో 10 మంది మృతి

ఒడిశా తీర ప్రాంతంతో పాటు భువ‌నేశ్వ‌ర్, క‌ట‌క్ ప‌ట్ట‌ణాల్లో భారీ వ‌ర్షం కురిసింది. పిడుగులు స్థానికులను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేశాయి. రాబోయే నాలుగు రోజుల పాటు ఒడిశా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

by Prasanna
lightining in odissa

ఒడిశా (Odissa) లో భారీ వర్షాలు (Heavy Rains)  కురుస్తున్నాయి. పలు చోట్ల పిడుగులు (Lightning) పడుతున్నాయి. శనివారం కురిసిన వర్షాలతో పాటు ఆరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుపాటుకు ఆరు జిల్లాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

lightining in odissa

lightining in odissa

ఖుర్దా జిల్లాలో న‌లుగురు, బోల‌న్‌గిర్‌లో ఇద్ద‌రు, అంగుల్, బౌద్, జ‌గ‌త్‌సింగ్‌పూర్‌, దేన్‌క‌నాల్ జిల్లాల్లో ఒక్కొక్క‌రి చొప్పున మృతి చెందారు. ఖుర్దా జిల్లాలో మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఒడిశా తీర ప్రాంతంతో పాటు భువ‌నేశ్వ‌ర్, క‌ట‌క్ ప‌ట్ట‌ణాల్లో భారీ వ‌ర్షం కురిసింది. పిడుగులు స్థానికులను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేశాయి. రాబోయే నాలుగు రోజుల పాటు ఒడిశా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

భువ‌నేశ్వ‌ర్‌లో అత్య‌ధికంగా 126 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. క‌ట‌క్‌లో 95.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అత్య‌వ‌స‌రమైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

సెప్టెంబర్ 3వతేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భువనేశ్వర్ లోని  ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్‌ఆర్ బిశ్వాస్ తెలిపారు.

You may also like

Leave a Comment