తెలంగాణ (Telangana) రాష్ట్రం రికార్డుల మీద రికార్డులు కొడుతుంది. ఇప్పటికే ఎన్నికల ఖర్చు భారీగా పెడుతున్న రాష్ట్రంగా.. మాదక ద్రవ్యాలు, ఓటర్ల ప్రలోభాలలో కూడా మొదటి స్థానాలో ఉన్న రాష్ట్రంగా వార్తల్లోకి ఎక్కిందన్న విషయం తెలిసిందే. మరోవైపు తాగుబోతుల రాష్ట్రంగా కూడా తెలంగాణ అవతరించిందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నదని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఏ చిన్న పండుగ జరిగినా.. లేదా మరేది జరిగిన ముందుగా గుర్తుకు వచ్చేది మందే అంటారు.. మరోవైపు ఎన్నికల పుణ్యాన తెలంగాణలో లిక్కర్ సేల్స్ (Liquor Sales) వీపరితంగా పెరిగాయి.. ముఖ్యంగా రికార్డు స్థాయిలో బీర్ల (Beers) అమ్మకాలు సాగినట్టు తెలుస్తుంది. ఎన్నికల జోష్ లో రాష్ట్రంలోని మందు బాబులు బీర్లను మంచినీళ్ళ కంటే ఎక్కువగానే గతికారని అంటున్నారు.
ఒక్క నవంబర్ (November) నెలలో 27 రోజులకు 21 లక్షల 69 వేల కేసుల లిక్కర్ సేల్స్ జరిగాయని లెక్కలు చెబుతున్నారు. అదీగాక 30 లక్షల 44 వేల కేసుల బీర్లు అమ్మకాలు సాగాయని వెల్లడించారు. ఈ లెక్కన రోజుకు దాదాపుగా లక్ష బీర్ల కేసుల విక్రయాలు జరిగాయన్న మాట.. జనం దాదాపుగా మూడు కోట్ల విలువైన బీర్లను తాగారని లెక్కలు చెబుతున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 20 మధ్య దాదాపు 22 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఇదే టైమ్ లో దాదాపు 12 లక్షల కేసులు బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయని వెల్లడించిన అధికారులు.. ఎన్నికల (Election) సందర్భంగా మూడు నెలల్లో దాదాపు రూ.8,900 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడు పోయిందని తెలిపారు.
జనరల్ గా వేసవిలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.. కానీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు వేసవి వేడిని తలపించాయి.. అందుకే బీర్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయాయని జనం ముచ్చటించుకుంటున్నారు..