Telugu News » Liquor Shops Close: మందుబాబులకు వారం వ్యవధిలోనే మరో షాక్..!

Liquor Shops Close: మందుబాబులకు వారం వ్యవధిలోనే మరో షాక్..!

వైన్స్(Wines), బార్లు మూసివేయాలని ఆదేశించారు. వారం వ్యవధిలోనే అధికారులు మళ్లీ వైన్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

by Mano
Liquor Shops Close: Another shock for liquor lovers..!

మద్యం ప్రియులకు అధికారులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ(Telangana)లో ఏప్రిల్ 23(మంగళవారం) హైదరాబాద్‌(Hyderabad)లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్స్(Wines), బార్లు మూసివేయాలని ఆదేశించారు. వారం వ్యవధిలోనే అధికారులు మళ్లీ వైన్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Liquor Shops Close: Another shock for liquor lovers..!

 

శ్రీరామనవమి(Sriramanavami) సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన మద్యం షాపులతో పాటు, వైన్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఆరు రోజులు గడవకముందే మంగళవారం(రేపు) మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కారణమేంటంటే మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికై హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా పర్వదినాలు, పండుగల సమయంలో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా త్వరలో లోక్‌సభ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు, మత ఘర్షణలకు తావు ఇవ్వకూడదని పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment