రాష్ట్రంలో ఎన్నికల పుణ్యమా అని మందుబాబులు మస్తుగా పండగ చేసుకున్నారు. నీళ్ళకంటే ఎక్కువగా మందును ఖాళీ చేశారు. కానీ ఇదే ఎన్నికలు మందుకు హాలిడే ప్రకటించడానికి కారణం అవుతున్నాయని ఫిల్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ముందు రోజు ఆల్కహాల్ కు హాలిడే ప్రకటించి రెండు రోజులు మందు చుక్క గొంతు దిగకుండా చేసిన అధికారులు.. మరోసారి షాకిచ్చారేంట్రా అని మందుబాబులు వాపోతున్నారు..
మరోవైపు రేపు తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కౌంటింగ్ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య (Sandeep Sandlya) కీలక ఆదేశాలు జారీ చేశారు.. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వైన్‌షాపులను (Wineshop) మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైన్‌షాపు యజమానులకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు ఈ వార్త తెలిసిన మందుబాబులు వైన్స్‌కు పరుగులు తీస్తున్నారు. అసలే వీకెండ్.. ఎంజాయ్ చేయాలంటే మందు ఉండాల్సిందే.. తాగి ఊగాల్సిందే. కానీ ఈ ఎన్నికల గోల ఏంట్రా బాబు అని అనికుంటున్నారు.. ఈ క్రమంలో రేపటి కోసం ఇవాళే మద్యం కొనేందుకు వైన్స్ షాపుల వద్ద జనం క్యూ కడుతున్నారు.
పొలిటికల్ హీట్ వైన్స్ షాపు బందుకు కారాణం అవుతుంటే.. ఆల్కాహాల్ టేస్ట్ అడ్వాన్స్ గా ఆలోచించి స్టాకు పెట్టుకునే కాడికి దారితీసిందని వీరి తీరు చూసిన వారు నవ్వుకుంటున్నారు..