లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సిద్దం అవుతున్న కాంగ్రెస్ (Congress).. ఇప్పటికే 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఇప్పటివరకు మొత్తం 184 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించినట్లయింది. అయితే తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది..
ఈమేరకు నేడు ఐదవ జాబితా రిలీజ్ చేసింది. కేవలం ముగ్గురు అభ్యర్థుల పేర్లతో మాత్రమే ఈ జాబితాను ప్రకటించింది. ఇందులో రెండు రాజస్థాన్ (Rajasthan), ఒకటి మహారాష్ట్ర (Maharashtra)లోని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ (Telangana) లోని 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 9 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఇదివరకు 36 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణకు చోటు దక్కింది. మొత్తం నలుగురి పేర్లను పొందుపరిచింది. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ నుంచి గానీ, ఏపీ నుంచి గానీ అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించకుండా అధిష్టానం ఆసక్తికరంగా మార్చింది.
మరోవైపు ఎంపీ ఎలక్షన్లో విజయమే లక్ష్యంగా.. బీజేపీ (BJP)ని బలంగా ఢీ కొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొన్న హస్తం.. విజయమే లక్ష్యంగా ప్రచారాలు నిర్వహించడం కనిపిస్తోంది. అందులో బీజేపీ ఓటమే లక్ష్యంగా కూటమితో ముందుగు సాగుతోంది.