Telugu News » Gali Janardhan Reddy: బీజేపీలోకి గాలి జనార్దన్‌రెడ్డి.. ఆ పార్టీ విలీనం..!

Gali Janardhan Reddy: బీజేపీలోకి గాలి జనార్దన్‌రెడ్డి.. ఆ పార్టీ విలీనం..!

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి(Ex Minister Gali Janardhan Reddy) బీజేపీ(BJP)లో చేరారు. ఇవాళ(సోమవారం) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

by Mano
Gali Janardhan Reddy: Gali Janardhan Reddy joined BJP.. that party will merge..!

కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి(Ex Minister Gali Janardhan Reddy) బీజేపీ(BJP)లో చేరారు. ఇవాళ(సోమవారం) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

Gali Janardhan Reddy: Gali Janardhan Reddy joined BJP.. that party will merge..!

కర్ణాటక సీఎంగా బీఎస్ యడియూరప్ప(BS Yeddyurappa) ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. అయితే, గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జైలుకు వెళ్లాగా ఆతర్వాత బీజేపీకి దూరమయ్యారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన గాలి జనార్దన్ రెడ్డి నేడు(సోమవారం) విజయేంద్ర మక్షంలో బీజేపీలో చేరుతున్నారు.

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి చేరుతుండటంతో పార్టీ వర్గాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. 2022లోనే జనార్దన్ రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్‌పీపీ)ని స్థాపించారు. అయితే ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ మేరకు కేఆర్‌పీపీ నేతలతో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసమే మళ్లీ తాను బీజేపీలో చేరానని తెలిపారు. మోడీని మరోసారి ప్రధాని చేయడానికే తన మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలో సేవలందిస్తానని తెలిపారు. అదేవిధంగా బీజేపీలో చేరతానని ఆదివారం రాత్రి ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ తమ రక్తంలోనే ఉందని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. బళ్లారి నుంచి పోటీ చేస్తున్న ఆయనకు మద్దతు తెలుపుతానని చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment