రాజకీయాలను శాసిస్తుంది డబ్బు అని అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు చాలా ఖరీదుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఎలక్షన్లలో పోటీ చేసే అభ్యర్థులు సైతం గెలుపు కోసం కోట్లల్లో ఖర్చుపెట్టడానికి వెనుకాడని పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే ఖరీదైన అభ్యర్థులే కాదు గరీబు వాళ్ళు కూడా ఉన్నారని ఈసీకి సమర్పించిన నేతల ఆస్తుల పత్రాలు నిరూపించాయి..
తాజాగా జాతీయ పార్టీలకు వారిలో పేద అభ్యర్థుల గురించి ఓ నివేదికను వెల్లడించింది. ఆ అభ్యర్థుల ఆస్తులు సగటు భారతీయ కుటుంబ ఆస్తి కంటే తక్కువగా ఉండటం గమనార్హం. జాతీయ పార్టీల్లో 2024 ఎన్నికల బరిలో ఫేజ్1, ఫేజ్2 పోటీలోని అభ్యర్థుల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP)కి చెందిన రంజిత్ కుమార్ బాలుస్వామి అత్యల్ప ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపింది.
తమిళనాడు (Tamil Nadu)కు చెందిన బాలుస్వామి రూ. 23,000 విలువైన ఆస్తులు మాత్రమే కలిగి ఉన్నారని.. ప్రముఖ ట్రాకర్మైనేత డాట్ ఇన్ఫో డేటా భారత ఎన్నికల సంఘం అఫిడవిట్లను ఆధారంగా ప్రకటించింది. మరోవైపు బీఎస్పీ ఉంచి అత్యంత సంపన్న అభ్యర్థి మాజిద్ అలీ రూ. 159 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారని పేర్కొంది. అలాగే యూపీ (UP) కాంగ్రెస్ (Congress) అభ్యర్థి ముఖేష్ ధంగర్ రూ. 1.3 లక్షలు, బీజేపీకి చెందిన మిజోరం నేత రూ. 11 లక్షలు కలిగి ఉన్నారు..
కేరళ (Kerala), అలెప్పి (Alleppey) నుంచి బీఎం థామస్ ఇసాక్ రూ. 13.4 లక్షలు, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మజెల్ అంపరీన్ లింగ్డో రూ. 2.2 కోట్లు, అస్సాం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రిషిరాజ్ కౌండియన్ రూ. 2.9 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా బీఎస్పీ అభ్యర్థీ ద్వారకా ప్రసా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యల్పంగా రూ. 1,000 ఆస్తులను ప్రకటించారు. బీజేపీ (BJP)కి చెందిన కృష్ణ జోయార్దార్ రూ. 6,200 ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.