Telugu News » Telangana : సెగలు పుట్టిస్తున్న ఎండలు.. అత్యధిక డిగ్రీలు అక్కడే..!

Telangana : సెగలు పుట్టిస్తున్న ఎండలు.. అత్యధిక డిగ్రీలు అక్కడే..!

ఉదయం నుంచే భానుడు నిప్పులు కుమ్మరిస్తుండగా.. ఏసీలు కూడా సరిపోవడం లేదంటున్నారు.. ఇక మధ్యాహ్నా పరిస్థితి అయితే 40 డిగ్రీలను దాటుతున్న ఉష్ణోగ్రతలు భయానికి గురి చేస్తున్నాయి..

by Venu
Telangana is getting hot.. Meteorological Department warns people!

తెలంగాణ (Telangana)లో భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు.. సెగలు పుట్టిస్తున్న ఎండలకు ఒంట్లో నుంచి వేడి పొగలు బయటికి వస్తుండటంతో ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. ఉదయం నుంచే భానుడు నిప్పులు కుమ్మరిస్తుండగా.. ఏసీలు కూడా సరిపోవడం లేదంటున్నారు.. ఇక మధ్యాహ్నా పరిస్థితి అయితే 40 డిగ్రీలను దాటుతున్న ఉష్ణోగ్రతలు భయానికి గురి చేస్తున్నాయి..

IMD Alert: Burning sun this week.. IMD alert..!మరో వైపు హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీచేసింది. రాగల ఐదురోజుల్లో వేడి, తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. మరోవైపు వడగాలులు సైతం వీస్తాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.

కొత్తగూడెం, అశ్వాపురంలో 45.3, ములుగు, మంగపేట 45.3, అలుబాక-జెడ్‌ 45.1, ధర్మవరం 45.2, అలాగే నల్గొండ, తిమ్మాపూర్‌ 45.2, ఇబ్రహీంపేట 45.1, మాటూర్‌ 45.1.. భూపాలపల్లి, కొత్తపల్లి గోరి 45.2, వనపర్తి, పాన్గల్‌ 45.1, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ విభాగం తెలియచేసింది. అదేవిధంగా ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ ప్రాంతాల్లో వడగాలులు విస్తాయని తెలిపింది.

మరోవైపు పెద్దపల్లి (Peddapally), జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ (Nalgonda), సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయ

You may also like

Leave a Comment