Telugu News » Tirumala : తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత పై క్లారిటీ ఇచ్చిన అధికారులు..!!

Tirumala : తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత పై క్లారిటీ ఇచ్చిన అధికారులు..!!

స్వయంగా భక్తులనే ఆహారం నాణ్యత విషయంపై సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.. ఆహార నాణ్యత బాగుందని.. ఉద్యోగుల సేవలో ఎలాంటి లోపం లేదని భక్తులు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా తమకు ఫిర్యాదు చేస్తే పరిష్కార మార్గాలను అన్వేషిస్తామంటున్నారు టీటీడీ అధికారులు.

by Venu

నారాయణ అని ఆ శ్రీహరిని పిలిచినంత మాత్రాన అణువణువు పులకించిపోతోంది.. అందుకే నిత్యం ఆ ఏడుకొండల వాడి దగ్గర కోట్లాది భక్తులు గోవిందా గోవిందా అంటూ స్మరణ చేస్తారు. అంతటి విశిష్టత కలిగిన తిరుమల (Tirumala) క్షేత్రంలోని ఆన్నదాన సత్రంలో చోటు చేసుకొన్న వివాదం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శ్రీవారి అన్న ప్రసాదంలో నాణ్యత లేదంటు ఇటీవల కొందరు భక్తులు సోషల్‌ మీడియాలో పెట్టి పోస్టు వైరల్ అయిన విషయం తెలిసిందే..

ఈ పథకంపై ఒక్క సారిగా ఆరోపణలు రావడంతో చర్చగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, అన్నదాన పథకం (Food Scheme)పై సోషల్‌ మీడియా (Social Media)లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడిస్తున్నారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అందుతున్న ఆహారం నాణ్యతను మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam) స్వయంగా పరిశీలించారు.

స్వయంగా భక్తులనే ఆహారం నాణ్యత విషయంపై సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.. ఆహార నాణ్యత బాగుందని.. ఉద్యోగుల సేవలో ఎలాంటి లోపం లేదని భక్తులు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా తమకు ఫిర్యాదు చేస్తే పరిష్కార మార్గాలను అన్వేషిస్తామంటున్నారు టీటీడీ అధికారులు.

You may also like

Leave a Comment