Telugu News » Maharashtra : వీళ్ళు ఆడవాళ్ళు కాదు బాబోయ్..!!

Maharashtra : వీళ్ళు ఆడవాళ్ళు కాదు బాబోయ్..!!

రోషన్‌ భార్య సంఘమిత్రని, రోసాని వారి పద్దతుల్లో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని, సంఘమిత్ర కుటుంబ గోడవలతో వారిపై పగ పెంచుకోగా ఇద్దరు కలిసి వారిని చంపేందుకు ప్లాన్ వేసినట్టు తెలిపారు.

by Venu

మానవత్వం మంటగలిస్తే ఆవేశం రాక్షస రూపం ధరిస్తుంది. ఆ క్షణంలో మనిషి విచక్షణ కోల్పోయి ఎంతటి దారుణాలకైనా తెగిస్తాడనేది నేటి సమాజంలో జరుగుతోన్న దారుణాలను చూస్తే అర్ధం అవుతోంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర (Maharashtra)లోని గడ్చిరోలి (Gadchiroli) లో జరిగింది. గడ్చిరోలికి చెందిన సంఘమిత్ర (Sanghamitra) అనే మహిళకు తన భర్తతో పాటు వారి కుటుంబం వ్యవహార శైలి నచ్చక గొడవలు పడేవారు.

మరోవైపు రోసా (Rosa) అనే మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉండటం వల్ల ఇద్దరు చేతులు కలిపి, ఆ కుటుంబాన్ని అంతమొందించాలని ప్లాన్ వేసుకొన్నారు. ఇందుకోసం రంగు, వాసన, రుచి లేని ఓ నాటు మందు సేకరించి.. శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో కలిపారు. ఆ పదార్ధాలు తిన్న వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులు, గుండెనొప్పి వచ్చాయి. దీంతో వారిని నాగ్‌పుర్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. సెప్టెంబరు 26న శంకర్‌, మరుసటిరోజు అతని భార్య విజయ చనిపోయింది.

మరోవైపు శంకర్‌ దంపతుల కుమార్తెలు ఆనంద, కోమల్‌ కుమారుడు రోషన్‌ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా అక్టోబరు 8న కోమల్‌, 14న ఆనంద, మరుసటి రోజు రోషన్‌ మరణించారు. అయితే ఈ మరణాల వెనక కామన్ పాయింట్ ఒక్కటే అని గుర్తించిన వైద్యులు వారంతా విష ప్రభావానికి గురై ఉంటారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోషన్‌ భార్య సంఘమిత్రని, రోసాని వారి పద్దతుల్లో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని, సంఘమిత్ర కుటుంబ గోడవలతో వారిపై పగ పెంచుకోగా ఇద్దరు కలిసి వారిని చంపేందుకు ప్లాన్ వేసినట్టు తెలిపారు. అయితే 20 రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని హత్య చేసిన వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో జైలు ఉచ్చలు లెక్కపెట్టిస్తున్నారు.

You may also like

Leave a Comment