Telugu News » Deva Gowda: దేవగౌడ మనవడి పై అనర్హత వేటు!

Deva Gowda: దేవగౌడ మనవడి పై అనర్హత వేటు!

హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.

by Sai
shock for ex prime minister grandson high court declared disqualification for mp

మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో ప్రజ్వల్ తప్పుడు సమాచారం సమర్పించారని అప్పటి బీజేపీ అభ్యర్థి ఎం. మంజు పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ. అనంతరం కోర్టు తీర్పు ఇచ్చింది.

shock for ex prime minister grandson high court declared disqualification for mp

కాగా, ఎం. మంజు ప్రస్తుతం జేడీఎస్‌లోనే ఉండటం విశేషం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అరకలగుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో, హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆస్తుల ప్రకటన వివరాలు, అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలైంది.

హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ అభ్యర్థి పిటిషన్‌లో పేర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అఫిడవిట్ దాఖలు చేస్తున్నప్పుడు, ప్రజ్వల్ రేవణ్ణ తన ఆదాయాన్ని రూ. 24 కోట్లకు పైగా దాచిపెట్టాడని పిటిషన్‌లో తెలిపింది. దీని తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పారు.

You may also like

Leave a Comment