బీజేపీ (BJP) పై ఎమ్మెల్సీ (MLC), టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఫైర్ అయ్యారు. దేశాన్ని ఆగం చేసే వరకు బీజేపీ లీడర్లకు నిద్ర పట్టదని విమర్శించారు.. పస లేని, పనికి రాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి కుట్రలు చేస్తున్నరని విరుచుకుపడ్డారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వరకు బీజేపీ ఆగేలా లేదని మండిపడ్డారు..
బీజేపీ బాండ్ల పేరిట, ఫండ్స్ పేరిట ఇబ్బంది పెడుతూ వేల కోట్లు దండుకోంటుందని ఆరోపించిన మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ (Congress)కి చెందిన 4 బ్యాంక్ లలో 11అకౌంట్స్ ని సీజ్ చేయడం దారుణమని పేర్కొన్నారు.. 210 కోట్ల డొనేషన్ లో 14, లక్షల క్యాష్ లావాదేవీలు జరిపిందనే చిన్న కారణం తో అకౌంట్స్ సీజ్ చేసిందని వివరించారు.. పార్లమెంట్ ఎన్నికల ముందు ఖాతాలో ఉన్న డబ్బులు వాడుకోకుండా ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడకు నిదర్శనమని తెలిపారు..
రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఈ విధంగా చేసిందని ఆరోపించారు.. దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇన్ కమ్ టాక్స్ కట్టిన చరిత్ర లేదని మహేశ్ కుమార్ అన్నారు.. ఎలెక్ట్రోల్ బాండ్స్ విషయంలో బీజేపీ పెద్ద స్కామ్ చేసిందని ఆరోపణలు చేశారు.. 50% పైగా ఎలెక్ట్రోల్ బాండ్స్ డబ్బులు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయని ఆరోపించారు. గతంలో ఈసీ, సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేసిన కేంద్రానికి బుద్ధి రాలేదని విమర్శించారు..
మరోవైపు 170 కోట్లు ఎలెక్ట్రోల్ బాండ్స్ బీజేపీకి మేఘా కంపెనీ ఇచ్చిందని మహేష్ ఆరోపించారు.. తొమ్మిదిన్నర ఏండ్లలో పార్టీ డోనేషన్స్ 10 రేట్లు పెరిగిందన్నారు.. అదేవిధంగా దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడటం ఆరాచకమని పేర్కొన్నారు.. మతం, దేవుళ్లు, అక్షింతల పేరిట మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చి.. పేదలకు అన్యాయం చేసిందని మహేశ్ ఫైర్ అయ్యారు.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు..