Telugu News » Maldives : భారత సైనికులకు మాల్దీవులు డెడ్‌లైన్‌.. ముదురుతోన్న వివాదం..!!

Maldives : భారత సైనికులకు మాల్దీవులు డెడ్‌లైన్‌.. ముదురుతోన్న వివాదం..!!

ఆదివారం మాలేలో తొలిసారిగా ఈ బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. సముద్రయాన భద్రత, విపత్తు నిర్వహణలో మాల్దీవుల ప్రభుత్వానికి వారు సహాయసహకారాలు అందిస్తున్నారు.

by Venu
maldvies

భారత దేశానికి ఇప్పటి వరకి చైనా, పాకిస్థాన్ దేశాలతో తలనొప్పి ఉందని అనుకొంటే.. తాజాగా మాల్దీవులు (Maldives) సైతం వీటి స్థానంలో చేరాయి.. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ (Modi)పై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో మొదలైన ఇరు దేశాల దౌత్య వివాదం, ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని (Indian Army) మార్చి 15 లోపు ఉపసంహరించుకోవాలని డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తోంది.

maldvies

 

భారత్‌తో సంబంధాలను తగ్గించుకుంటామని హామీ ఇచ్చి మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) అధికారాన్ని చేజిక్కించుకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన చైనా పర్యటనను పూర్తి చేసుకొన్న అనంతరం భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్‌లైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. ఈమేరకు సైన్యం ఉపసంహరణపై చర్చల కోసం ఇరు దేశాలు హైలెవెల్ కోర్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాయి.

ఆదివారం మాలేలో తొలిసారిగా ఈ బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. సముద్రయాన భద్రత, విపత్తు నిర్వహణలో మాల్దీవుల ప్రభుత్వానికి వారు సహాయసహకారాలు అందిస్తున్నారు. అయితే ఇదివరకు అధికారంలో ఉన్న మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్ధన మేరకు భారత్ సైనిక సిబ్బందిని అక్కడకు పంపించింది.

అయితే, గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్ అనుకూల ప్రభుత్వం ఓడిపోయింది. చైనాకు అనుకూలంగా వ్యవహరించే ముహమ్మద్ ముయిజ్జు అధికార పగ్గాలు చేపట్టారు. తాజాగా ఆయన భారత్‌.. తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించడం సంచలనంగా మారింది. మొత్తానికి విమర్శలతో మొదలైన ఈ వివాదం చివరికి ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని అనుకొంటున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!

You may also like

Leave a Comment