Telugu News » Maldives: భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవ్స్‌ వైపుగా చైనా గూఢచార నౌక..!

Maldives: భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవ్స్‌ వైపుగా చైనా గూఢచార నౌక..!

చైనీస్ నౌక(Chinees Ship) జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మైరెన్ ట్రాకర్ యాప్ పేర్కొంది. మాలె దిశగా ప్రయాణిస్తున్న 'షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై భారత నేవీ నజర్ పెట్టింది.

by Mano
Maldives: In case of conflict with India.. Chinese spy ship towards Maldives..!

భారత్‌(Bharath)తో మాల్దీవుల(Maldives) వివాదం నెలకొన్న వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా గూఢచార నౌక ఒకటి ఆ దేశం దిశగా ప్రయాణం కొనసాగిస్తుండటం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చైనీస్ నౌక(Chinees Ship) జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మైరెన్ ట్రాకర్ యాప్ పేర్కొంది.

Maldives: In case of conflict with India.. Chinese spy ship towards Maldives..!

అయితే, మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 03’ నౌకపై భారత నేవీ నజర్ పెట్టింది. ఈ నౌక విషయం తమకు తెలుసు.. దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని భారత్ నౌవీ అధికారులు చెబుతున్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యతక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌తో వివాదాలకు దారి తీస్తున్నాడు. భారత్‌పై, ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత కామెంట్స్‌ ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసింది.

ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన ముయిజ్ఞు.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డెడ్‌లైన్ విధించాడు. తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెళ్తుండటంతో తీవ్ర పరిణామం చోటు చేసుకొన్నది. గతంలో కూడా ఇదే తరహాలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ షిప్ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019, 2020లలో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియెన్ సైమన్ తెలిపాడు.

You may also like

Leave a Comment