తెలంగాణ (Telangana) కార్మిక శాఖ మంత్రి (Labor Minister)చామకూర మల్లారెడ్డి (Mallareddy)స్టైయిలే వేరు. అసెంబ్లీలో కానీ, బయట కానీ నిత్యం ఏదో ఒక వినూత్నమైన పనులు, డ్యాన్స్ చేస్తూ, డైలాగులు విసురుతూ.. అందరికి వినోదాన్ని పంచుతారు. తన కామెడితో జనాన్ని నవ్విస్తారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మేడ్చల్ మల్కాజ్ గిరి నియోజకవర్గం (Medchal Malkaz Giri Constituency)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లన్న.. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రోడ్డు, అంబేద్కర్ నగర్ లో 10వేల మంది కార్యకర్తలతో భారీ రోడ్డు షో నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్డు షోలో మాట్లాడిన మల్లారెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ హయంలోనే రాష్ట్రం అభివృద్థి సాధ్యమని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇంకా గొప్పగా జవహర్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. వేరే పార్టీకి రాష్ట్రాన్ని అప్పగిస్తే మళ్లీ 50 ఏళ్లు వెనక్కి పోతుందని విమర్శించిన మంత్రి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
కార్యకర్తల్లో జోష్ నింపడానికి 30వ తారీఖు వేలుకు ఇంకు.. తర్వాత రాష్ట్రమంతా పింకో పింకు అంటూ మంత్రి చామకూర మల్లారెడ్డి సందడి చేశారు.. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటుగా మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి.. మేయర్ కావ్య.. డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.