Telugu News » SBI Electoral Bonds: ‘ఎలక్టోరల్ బాండ్ల లెక్కలివే..’ సుప్రీంలో ఎస్‌బీఐ అఫిడవిట్..!

SBI Electoral Bonds: ‘ఎలక్టోరల్ బాండ్ల లెక్కలివే..’ సుప్రీంలో ఎస్‌బీఐ అఫిడవిట్..!

ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించినట్లు ఎస్​బీఐ అఫిడవిట్​లో స్పష్టం చేసింది.

by Mano
Mallikarjun Kharge: Kharge Clarity on Lok Sabha Election Contest..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టు(Supreme Court)కు తెలిపింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించినట్లు ఎస్​బీఐ అఫిడవిట్​లో స్పష్టం చేసింది.

Mallikarjun Kharge: Kharge Clarity on Lok Sabha Election Contest..!

ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ పేర్లు ఈసీకి సమర్పించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. 2019 ఏప్రిల్ 14 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన డేటాను ఈసీకి అందించినట్లు వెల్లడించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్‌లు కొనుగోలు అయ్యాయని పేర్కొంది. వాటిలో 22,030 రెడీమ్ అయ్యాయని వివరించింది.

“కోర్టు ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో మేం జారీ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం. ఈ బాండ్లను ఎవరెవరు ఎంత కొనుగోలు చేశారు? ఏ పార్టీలు ఎంత ఎన్‌క్యాష్‌ చేసుకున్నాయి? వంటి వాటిని అందించాం” అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ అఫిడవిట్‌ సమర్పించారు. గత నెల ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో ఎస్‌బీఐ వీటిని విక్రయించింది. వ్యక్తులు/సంస్థలు వీటిని కొనుగోలు చేసి అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధుల కింద అందించాయి. నిబంధనల ప్రకారం జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. ఆలోగా రాజకీయ పార్టీలు వాటిని ఎన్‌క్యాష్‌ చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత నగదును పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేస్తారు.

You may also like

Leave a Comment