పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి (TMC Chief) మమతా బెనర్జీ (Mamatha Benarjee) కారు ప్రమాదానికి గురైంది. రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని కోల్ కతాకు తిరిగి వస్తున్న కమ్రంలో ఆమె కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో మమతా బెనర్జీకి తలకు స్వల్ప గాయాలయ్యాయి.
పొగ మంచు ఉండటంతో దారి అస్పష్టంగా ఉండటంతో కాన్వాయ్‌లో ముందున్న వాహనానికి సీఎం కూర్చున్న వాహనం దగ్గరకు వెళ్లింది. వెంటనే విషయం గుర్తించిన డ్రైవర్ సడెన్ బ్రేకులు వేశారు. దీంతో ముందు సీట్లో కూర్చుకున్న సీఎం మమతా బెనర్జీకి నుదరు, చేతికి గాయాలయ్యాయని తెలుస్తోంది.
బుర్దవాన్ జిల్లాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి మమతా బెనర్జీ హెలికాప్టర్ లో వెళ్లారు. అక్కడ సమావేశంలో ప్రసంగించిన అనంతరం కోల్‌కతాకు బయలు దేరారు. కానీ వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఆమె కారులో కోల్‌కతాకు బయలు దేరారని స్థానిక పోలీసులు వెల్లడించారు. కారు బయలు దేరిన కొంత సమయానికి ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు.
కారు డ్రైవర్ బ్రేకులు వేయడంతో ఆమె తల కారు విండోకు తగలడంతో గాయమైనట్టు చెప్పారు. స్వల్ప గాయాలే కావడంతో ఆమె అక్కడ ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా కోల్ కతాకు వెళ్లి పోయారని వివరించారు. కోల్ కతాకు చేరుకున్న తర్వాత ఆమె ఆస్పత్రికి వెళతారని పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారన్నారు.